ప్లానింగ్ కమిషన్లో మార్పులు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రధాని న...

ప్లానింగ్ కమిషన్లో మార్పులు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రధాని నివాసంలో ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో ప్లానింగ్ కమిషన్ ప్రాధాన్యత కోల్పోయిందన్నారు. ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రుల మండలి ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ఆహ్వానించదగ్గదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రుల ప్రాతినిథ్యంలో ఒక శాశ్వత సచివాలయం ఉండటం అవసరమని తెలిపారు. రాష్ర్టాలకు వివిధ పథకాలు, ఇతర ఆర్థిక సహాయాలు, నిధులు కేటాయింపు ఫైనాన్స్ కమిషన్ ద్వారా జరగాలని అభిప్రాయపడ్డారు.