మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్, డిసెంబర్ 21 (టీ మీడియా) : రానున్న కా లంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేంద...
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్, డిసెంబర్ 21 (టీ మీడియా) : రానున్న కా లంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనుందని టీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం కోసం ఉద్యమించిన సమయాల్లో కేసీఆర్ ఈ ప్రాంత నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా ప రిశీలించారని, వాటిని పరిష్కరించాలన్న కృతనిశ్చయంతో సీఎం ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా, 16 శాతం జనాభాను కలిగి ఉన్న పాలమూ రు జిల్లాలో 44 లక్షల మందికి పైగా జ నాభా ఉందని, ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో లక్షా 61వేల 693 మంది నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని, మరో 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఆయా ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. వీరిలో ఎస్సీలు 30వేలు, ఎస్టీలు 9,434, బీసీలు 84వేలు, ఇతరులు 34వేల మందికి పైగా ఉన్నారని వివరించారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లోనూ 15 శాతం స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో ఒ క్క శాతం కూడా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఉ న్న పరిశ్రమల్లో 60 నుంచి 80 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తె లిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆయా పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని, వాటన్నింటినీ భర్తీ చేస్తే నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయన్నారు. త్వరలో నే పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఏ అ భ్యర్థిని రంగంలో దింపినా అతని గెలుపు కోసం నిరుద్యోగులతో పాటు ఉ ద్యోగులు అందరూ కృషి చేయాల్సిన అ వసరముందన్నారు. నిర్ణీత గడువులోగా ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో టీపీఆర్టీయూ నేతలు పెద్ద యుగంధర్‌రెడ్డి, దుంకుడు శ్రీనివాస్, నిస్సిదెబోరా, చిన్న యుగంధర్‌రెడ్డి, శ్రీధర్, రంజిత్, బాలరాజు, చెంచెల రవి, రాఘవ, సదానంద్, నవీన్, జైపాల్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.