ముజఫర్‌నగర్: రోహ్తక్ సిస్టర్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో.. ఇద్దరు అమ్మాయిలు బస్సులోనే కీచకుల భరతం పట్టారు. అందరిముందే వారికి దేహశుద్ధ...
ముజఫర్‌నగర్: రోహ్తక్ సిస్టర్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో.. ఇద్దరు అమ్మాయిలు బస్సులోనే కీచకుల భరతం పట్టారు. అందరిముందే వారికి దేహశుద్ధి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో గురువారం సాయంత్రం ఇద్దరు కళాశాల అమ్మాయిలు బస్సులో ప్రయాణిస్తుండగా కల్పిత్కుమార్ (25), సామ్రాట్ (22) వారిని వేధించసాగారు. దీంతో ఆ ఇద్దరు యువతులు తిరగబడ్డారు. యువకులకు దేహశుద్ధి చేశారు. ఆ అమ్మాయిలకు ప్రయాణికులు కూడా అండగా నిలిచారు. కీచక యువకులను పోలీసులకు అప్పగించారు.