సైబర్‌వార్ మరో సవాల్ ( Cyber War )

ఎముకలు కొరికే చలి, మాడి మసైపోయే ఎండలు, కొట్టుకుపోయేంత వాన లు, ఎటుచూసినా శవాల గుట్టలు, రాత్రనకా పగలనకా కాల్పుల శబ్దాలు, యుద్ధవిమానాల రొదలు...


ఎముకలు కొరికే చలి, మాడి మసైపోయే ఎండలు, కొట్టుకుపోయేంత వాన లు, ఎటుచూసినా శవాల గుట్టలు, రాత్రనకా పగలనకా కాల్పుల శబ్దాలు, యుద్ధవిమానాల రొదలు.. ఇది సం ప్రదాయ యుద్ధరీతి. ఏసీ రూముల్లో ఇం టర్నెట్ యుద్ధక్షేత్రం, కంప్యూటర్ ఆయుధాలు కంటికి కనబడని శత్రువు. ఎవరూ చావ రు. కానీ నిముషాల్లో నాశనం. కోట్ల కొల ది బిలియన్ల నష్టం. ఇదీ నేటి ఆధునిక రణతంత్రం!


ch



ఇవ్వాళ.. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోని ప్రభుత్వ సంస్థలు, పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీలు తమ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్లోనే నిర్వహిస్తున్నాయి. ఇది రోజురోజుకూ పెరుగుతూ, స్మార్ట్‌వరల్డ్ వైపు పరుగులు తీస్తున్నది. అన్నం వండటం నుంచి ఆయిల్‌రిగ్ దాకా, పోలీస్ స్టేషన్ నుంచి పవర్‌గ్రిడ్ దాకా అంతా ఆన్‌లైనే. రోజూ కొన్ని కోట్ల డాలర్ల వ్యాపారం. కొన్ని టెరాబైట్ల సమాచార మార్పిడి ఇంటర్నెట్ ద్వారానే జరుగుతు న్నది. ఇదంతా ఆయా కంపెనీల కంప్యూటర్లు, సర్వర్ల లో నిక్షిప్తమై ఉంటుంది. ఎవరైనా ఆ కంప్యూటర్ ఓపె న్ చేసి, అందులోని కీలక సమాచారమంతా తీసేస్తే? లేదా పోటీ కంపెనీకి అమ్మేస్తే..? ఆ కంపెనీ క్షణాల్లో రోడ్ల మీదకు వస్తుంది. సరిగ్గా ఇదే పనిని హ్యాకర్లు చేస్తున్నారు. అయితే వారి లక్ష్యాలు వేరు కావచ్చు. కానీ జరుగుతున్న నష్టం మాత్రం అపారం. 

ఈ దాడుల్లో వెబ్‌సైట్లపై జరిగేవి, నెట్‌వర్క్‌పై జరిగేవి వేర్వేరు. వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైతే పెద్దగా బాధపడవలసిన అవసరంలేదు. అదే కంపెనీ లేదా సంస్థ నెట్‌వర్క్ దాడికి గురైతే తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆ సంస్థకు సంబంధించిన కీలక వ్యాపార సమాచారం, కస్టమర్ల వివరాలు, ప్రాడక్ట్ తయారీ విధానాలు.. అన్నీ బయటకు పొక్కుతాయి. దానివల్ల ఆ కంపెనీ లేదా ఆ దేశం ఉనికే రిస్క్‌లో పడుతుంది. ఇదంతా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు చేస్తే దాడి అవుతుం ది. అదే దేశాలే చేస్తే యుద్ధం అవుతుంది.

తాజాగా వార్తల్లో నానుతున్న సైబర్ దాడి.. సోనీ కంపెనీపై. సోనీ పిక్చర్స్ తీస్తున్న ఒకానొక సినిమా నచ్చక, ఏకంగా సోనీ నెట్‌వర్క్‌పైనే దాడిచేసి, నానా భీభత్సం సష్టించారు. వారు తీయబోత్ను సినిమా స్క్రిప్టుతో సహా ఉద్యోగుల వివరాలు, జీతభత్యాలు, షూటింగ్ అయిపోయి ఎడిటింగ్ దశలో ఉన్న సినిమా లు.. అన్నింటినీ ఇంటర్నెట్ చౌరస్తాలో పెట్టే శారు. ఒక్క వారంలో సోనీకి వందల కోట్ల డాలర్ల దెబ్బ. విచిత్రమేమిటంటే.. ఈ దాడి దశలవారీగా జరిగింది. మొదటి దాడి జరిగాక కూడా సోనీ తీసుకున్న జాగ్రత్తలు హ్యాకర్లను నిరోధించలేకపోయాయి. 

దీన్ని బట్టి హ్యాకింగ్ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందో, దాన్ని అరికట్టే వ్యవస్థలు ఎంత నిర్లిప్తంగా, బలహీనంగా ఉన్నాయో తెలుస్తున్నది. ఇలాంటి దాడులే ప్రభుత్వాలపై, ప్రభుత్వ రంగ సంస్థలపై జరిగితే దేశాలకు దేశాలే అల్లకల్లోలమవుతాయి. ఇవన్నీ తెలిసి కూడా చాలా దేశాలు కళ్లు తెరవట్లేదు. సమాచార భద్రతా సాంకేతికతను తగురీతిలో అందిపుచ్చుకోవడంలేదు.


సైబర్ ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోయిన ఈ తరుణంలో సైబర్ యుద్ధ నిపుణులను వెంటనే తయారుచేసుకోవాలి. ప్రతి కంపెనీ సమాచార భద్రతా అధికారులను నియమించుకోవాలి.



ఈ మధ్యకాలంలో నెట్‌వర్క్ దాడులు ఆశ్యర్యకరరీతిలో వృద్ధి చెందాయి. సంఖ్య విషయంలోనే కాదు, నాణ్యత(?), ఖచ్చితత్వాలలో కూడా. మన ఆరోగ్యం, వ్యాపారం, మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వహించగలిగే సామర్థ్యమున్న కంప్యూటర్ ఆధారిత పరికరాలతో పాటు కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు కూడా ఇంటర్నెట్‌కు అనుసంధానం కావడంతో విశ్వమంతా హ్యాకింగ్ గుప్పిట్లో ఇరుక్కున్నది.

దీనికి ఈ మధ్య దేశాలు కూడా తోడయ్యాయి. ఆర్థికపరంగా, మేధోపరంగా, ఆయుధపరంగా తమకంటే ఉన్నత స్థితిలో ఉన్న శత్రు దేశాలను దెబ్బకొట్టడానికి సైబర్ యుద్ధతంత్రాన్ని కూడా ఎంచుకుంటున్నాయి. అమెరికాపై చైనా, భారత్‌పై పాకిస్థాన్.. ఇలా. సంప్రదాయ యుద్ధం చేయడానికి కావలసిన ఆర్థిక సంపత్తి దీనికి అవసరం లేదు. కేవలం ఒక లాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేచాలు. 2010లో ఇరాన్‌లోని ఒక అణుకేంద్రం నెట్‌వర్క్‌పై దాడి జరిపి అది పనిచేసే పద్ధతిని మార్చడం వల్ల ఒక విభాగం పూర్తిగా బద్దలైంది. మరోవైపు సైబర్ ఆధారికత గూఢచర్యం కూడా ఇందు లో భాగ మే. దీనిలో అమెరికా టాప్. జాతీయ భద్రతాసంస్థ పేరుతో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాలపై, రాజకీయపార్టీలపై ఎన్‌ఎస్‌ఏ నిఘా పెట్టింది. 

దీనికోసం ప్రత్యేకంగా ఉపగ్రహాలను కూడా ప్రయోగించింది. ఇలా ప్రతీ దేశం సైబర్‌దాడులకు గురవడంతో సైబర్ భద్రతపై ఆసక్తి, అవసరాలు పెరిగాయి. ఒక నెట్‌వర్క్‌పై ఒక దాడి జరిగితే, ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టడం, వీలైనంత తక్కువగా నష్టపోయేటట్టుగా, త్వరగా తిరిగి నెట్‌వర్క్‌ను యధాస్థితికి తీసుకురావడం, అసలు దాడికే అవకాశం లేకుండా పూర్తి రక్షణాత్మక వ్యవస్థను నెలకొల్పడం వంటివి సైబర్ భద్రతలో ముఖ్యాంశాలు. దాడిలో ఎటువంటి ఆధునిక సాంకేతికత ఉన్నదో, భద్రతలో కూడా అంతే లేదా అంతకంటే ఎక్కువ సాంకేతికత ఉండితీరాలి. 

గత నెలలో జరిపిన ఒక సర్వే ప్రకారం, ప్రపంచం లో ప్రతి సెకనుకు 18దాడుల చొప్పున ఏడాదికి 556 మిలియన్ దాడులు జరుగుతున్నాయి. ఇందులో 232 మిలియన్లు మాత్రమే బయటపడుతున్నాయి. వీటిలో 38.9 శాతం వైద్య, ఆరోగ్యరంగాలపై, 35.1 శాతం వ్యాపార రంగాలపై, 10.7శాతం విద్యాసంస్థలపై, 9.9శాతం ప్రభుత్వ, రక్షణరంగాలపై, 5.3శాతం బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సంస్థలపై జరుగుతున్నాయి. ప్రతిరోజూ 6 లక్షల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. యాపిల్, అడోబ్ వంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజాలే ఈ సైబర్ దాడులకు తలవంచక తప్పడం లేదు. గత ఏడాదికి, ఇప్పటికే ఈ దాడులు 225శాతం పెరిగాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

భారత్‌లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏంలేదు. ఇక్కడ ప్రతి మూడు నిమిషాలకు ఒక దాడి జరుగు తున్నది. భారత్‌లో ఉన్న కంపెనీలలో ప్రతీ మూడవ కంపెనీ సైబర్ దాడులకు అనువుగా ఉన్నది. పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థను మార్చుకునే మెళకువ లు, బడ్డెట్, సైబర్ నిపుణులు అందుబాటులో లేకపోవడమే ప్రధాన సమస్య. భారత్‌లో 54.55శాతం కంపెనీల అధికారులు సైబర్ దాడుల ఉధృతి క్రమంగా పెరుగుతున్నదని అంగీకరించగా, 51.9శాతం మంది తమ కంపెనీలలోని సమాచార భద్రతావ్యవస్థ చాలా లోపభూయిష్టంగా ఉందని ఒప్పుకున్నారు. ఇందులో ప్రభుత్వరంగ సంస్థలకు మినహాయింపేమీ లేదు. ఈ స్థితుల్లో సమాచార వ్యవస్థలు, జాతీయ భద్రత పెను ప్రమాదతీరంలో ఉన్నాయి. 

దాదాపు 900 మిలియన్ వినియోగదారులున్న టెలికాం రంగంలో, సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ ఇంచుమించు మొత్తం ప్రయివేటు కంపెనీల చేతుల్లోనే ఉన్నది. 40శాతం ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు జరుగుతున్న బ్యాంకుల్లో పెద్దయెత్తున ప్రైవేటు, విదేశీబ్యాంకులే ఉన్నాయి. విమానయాన రంగంలో ఆరునెలల్లోనే 4కోట్ల మంది ప్రయాణీకులు ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకున్నారు.

ఈ పరిస్థితుల్లో అమెరికా భారత్‌పై పూర్తిస్థాయి నిఘా పెట్టిందన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించి, గత సంవత్సరం సైబర్ సెక్యూరిటీ పాలసీని ప్రవేశపెట్టింది. కంపెనీలకు, ప్రభుత్వరం గ సంస్థలకు కావల్సిన సౌలభ్యాలన్నీ అందజేయడం, సైబర్ భద్రతపై ఒక ప్రత్యేక వ్యవస్థ 24 గంటలూ పనిచేసేవిధంగా నెలకొల్పడం, రాబోయే ఐదేళ్ల్లలో 5 లక్షలమంది సైబర్ భద్రతానిపుణులను తయారుచేయ డంతో పాటు సైబర్‌నేరాలకు సంబంధించి ముందుజాగ్రత చర్యలు చేపట్టింది. దర్యాప్తు, విచారణ ఇత్యా ది చట్టపరమైన చర్యలు ఇందులో ఉన్నాయి. సైబర్ భద్రతకు సంబంధించి ఇజ్రాయిల్, సింగపూర్, అమెరికా దేశాలు పటిష్టమైన చర్య లు తీసుకుంటున్నాయి. ఇక్సియా, ఎన్‌ఇసి, సిస్కో వంటి కంపెనీలు సమర్థవంతమైన నెట్‌వర్క్ భద్రతావ్యవస్థను నెలకొల్పడంలో ఎంతో కృషి చేస్తున్నాయి. 

ఈ కంపెనీల సహకారంతో ప్రపంచంలో మొదటిసారిగా సింగపూర్ సైబర్ సెక్యూరిటీ అకాడమీని నెలకొల్పింది. ఇందులో విద్యార్థులు రకరకాల సైబర్ దాడులను ఎదుర్కునే పద్ధతులు, తమ నెట్‌వర్క్‌ను ఎలా కాపాడుకోవాలో నేర్చుకుంటారు. సింగపూర్ పాలీగా పిలిచే సింగపూర్ పాలిటెక్నిక్ ఇందుకు వేదికయింది. భారత్‌లో కూడా ఇటువంటి విద్యాసంస్థ అవసరం ఉన్నది. అయితే కేవలం ప్రభుత్వ కార్యకలాపాలకే పరిమితం కాకుండా, ఇతర కంపెనీల ఉద్యోగులకు, ఉన్న త విద్యాసంస్థలైన ఐఐ టి, ఐఐఎం, ఐఐఐటి, నిట్, బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకు కూడా ప్రవేశం కల్పించాలి. సర్టిఫికెట్, డిప్లొ మా, డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టి, విదేశీ విద్యార్థులకు కూడా అవకాశమిస్తే వ్యాపారపరంగా, మేధోపరంగా నూ ఉపయుక్తంగా ఉంటుంది.

సైబర్ ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోయిన ఈ తరుణంలో సైబర్ యుద్ధ నిపుణులను వెంటనే తయారుచేసుకోవాలి. ప్రతి కంపెనీ సమాచార భద్రతా అధికారులను నియమించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పెద్ద కంపెనీలు సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌లను నెలకొల్పుకోవాలి. హోమ్ డిపార్ట్‌మెంట్‌లో అంతర్భాగంగా పోలీస్, సిఐడి, కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్‌తో కూడిన సెంట్రల్ కమాండ్ సెంటర్‌లో సైబర్ ఫోరెన్సిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే నేరపూరిత ఇంటర్నెట్ దాడులను పూర్తిగా నిరోధించవచ్చు.

విదేశాలనుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి, అనుమానిత సాఫ్ట్‌వేర్లేవీ లేవని నిర్ధారించగలిగే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అలాగే ప్రతి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థ తమ నెట్‌వర్క్‌ల సామర్థ్యాన్ని పరీక్షించి, దాడులు జరిగితే ఏ మేరకు తట్టుకోగలవో విశ్లేషించగలిగే సంస్థల ను తయారుచేసుకుని, తదనుగుణంగా వ్యవస్థలను ఎప్పటికప్పుడు మార్చుకుంటుండాలి. ప్రభుత్వాలు, పౌరసమాజం భూమి, అంతరిక్షాలతో పాటు ఇంటర్నెట్‌ను కూడా మరో యుద్ధక్షేత్రంగా పరిగణించి, జాతీయ సైబర్ భద్రతా వ్యవస్థను ఏర్పరుచుకోవాలి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనేది అత్యంత సంక్లిష్టమైన విషయం. అమెరికా తరహాలో ఒక సెంట్రల్ సైబర్ కమాండ్‌ను ఏర్పాటు చేసి, దానికి తగిన నిపుణుడిని వ్యూహ, ప్రణాళిక, అమలు వ్యవహారాలకు పూర్తిస్థాయి సామర్థ్యమున్న వారిని నియమిస్తే దేశం ప్రగతిబాటలో పయనిస్తుంది.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: సైబర్‌వార్ మరో సవాల్ ( Cyber War )
సైబర్‌వార్ మరో సవాల్ ( Cyber War )
http://namasthetelangaana.com/updates/2014/dec/24/ch.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2014/12/cyber-war.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2014/12/cyber-war.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy