(టీ మీడియా, సూర్యాపేట): మిషన్ కాకతీయ... చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. అన్యాక్రాంతమైన చె...
(టీ మీడియా, సూర్యాపేట): మిషన్ కాకతీయ... చెరువుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. అన్యాక్రాంతమైన చెరువులను గుర్తించడం, పూడిక తీత మొదలుకుని కరకట్టల పటిష్టం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 4831చెరువులను గుర్తించగా తొలి విడతలో 952చెరువులకు మరమ్మతులు చేయడానికి సంకల్పించింది. పనుల్లో భాగంగా కట్టలకు ఇరువైపులా ఈత చెట్ల పెంపునకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం తమకు లాభం చేకూర్చేలా ఉన్నదని గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ కంపెనీలకు చెందిన రంగురంగుల మద్యం సీసాలు... నాటుసారా తదితరాలతో ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్న నేటి తరుణంలో ప్రకృతి ప్రసాదమైన కల్లు వినియోగం చాలా వరకు తగ్గిపోయింది.
కొన్నేళ్ల కిందట ఎక్కడ చూసినా కన్పించే తాటి, ఈత వనాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాటిచెట్లతో పోల్చితే ఈత చెట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదంగా చెప్పుకుంటూ... ఎలాంటి హానికరం కాని ఈతకల్లును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈతవనాల పెంపకంపై దృష్టి సారించి ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే మిషన్ కాకతీయకు అనుసంధానం చేయబోతోంది.
పట్టించుకోని సీమాంధ్ర పాలకులు...
సుమారు పదిహేను సంవత్సరాలు వెనక్కువెళితే గ్రామాలు, పట్టణాల్లో కల్లు వినియోగం అంతాఇంతాకాదు. ఎవరి ఇంటికైనా బంధువులు వస్తే కల్లు ముంత తీసుకువచ్చి మర్యాద చేసేవారు. అలాంటిది నేడు కల్లు కనుమరుగై ఆ స్థానంలోకి ఆయా కుటుంబాల స్థాయిని బట్టి వివిధ కంపెనీలకు చెందిన రంగురంగుల మద్యం సీసాలు, బీర్లు, చీప్‌లిక్కర్, నాటుసారాతో దావత్ ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. ఇందుకు ఫ్యాషన్ ఓ కారణం కాగా, గతంలో మాదిరిగా కల్లు లభించకపోవడం మరో కారణంగా చెప్పుకోవచ్చు.
నాటి ప్రభుత్వాలు సైతం పట్టించుకోకపోవడంతో తాటి, ఈత చెట్లు భారీ ఎత్తున తగ్గిపోయాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 3,51,680తాటి చెట్లు, 43,007 ఈత చెట్లు ఉన్నాయి. వీటిపై 27,615మంది గీత కార్మికులకు ఉపాధి లభిస్తున్నట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలు చెబుతోంది. పదిహేనేళ్ల కిందట ఈ లెక్కలు దాదాపు రెట్టింపు అంటే తాటి చెట్లు 5.5లక్షలు, ఈత చెట్లు లక్ష వరకు ఉండగా తదనంతరం నగరీకరణ, రియల్ ఎస్టేట్ తదితర కారణాలతో తాటి, ఈత చెట్లను తెగనరికినా పట్టించుకున్ననాథుడే కరువయ్యారు.
మామూలుగా తాటి, ఈత కల్లులు ఒకటి లభించని సమయంలో మరోటి వస్తుందని గతంలో సంవత్సరం మొత్తం ఈ రెండు చెట్లపై ఆధారపడ్డి దర్జాగా జీవించే అవకాశం ఉండగా నేడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని పలువురు గీతకార్మికులు వాపోతున్నారు. చెరువు కట్టలపై ఈతచెట్లు పెంచాలన్న ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరో ఐదేళ్లలో తమకు చేతినిండా పనిదొరుకుతుందని గీతకార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కల్లును శీతలపానీయాల జాబితాలోకి చేర్చే అవకాశం కూడా ఉంటుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
చెరువు కట్టలకు రెండు వైపులా ఈత వనాలు...
మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణలో భాగంగా కట్టలను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తూ ఇరువైపులా ఈత చెట్లను నాటాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయమై డీఎఫ్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ చెరువు కట్టల వెంట ఈత చెట్లు నాటాలని తమకు ఆదేశాలున్నాయని చెప్పారు. గతంలో తుమ్మచెట్లతో పాటు పలు రకాల చెట్లు ఉండేవని ఇప్పుడు కూడా తుమ్మ, తెల్లమద్ది తదితర చెట్లు నాటడం జరుగుతుందన్నారు. జిల్లాలో 4,831 చెరువులను గుర్తించగా మొదటి విడతగా ఈ సంవత్సరం 952చెరువులకు మరమ్మతు చేయనున్నట్లు వివరించారు.