16 ఏండ్ల బాలికపై 80 ఏండ్ల వృద్ధుడి లైంగికదాడి ఆలస్యంగా వెలుగులోకి.. పోలీసులకు ఫిర్యాదు బెల్లంపల్లి రూరల్, డిసెంబర్ 21 (టీ మీడియా): ఆదిలా...
16 ఏండ్ల బాలికపై 80 ఏండ్ల వృద్ధుడి లైంగికదాడి
ఆలస్యంగా వెలుగులోకి.. పోలీసులకు ఫిర్యాదు
బెల్లంపల్లి రూరల్, డిసెంబర్ 21 (టీ మీడియా): ఆదిలాబాద్ జిల్లాలో ఓ బాలిక(16)ను, 80 ఏళ్ల వృద్ధుడు గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం రాత్రి వెలుగుచూసింది. బెల్లంపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను, ఇంటి సమీపంలోని వృద్ధుడు మాయమాటలతో ఆరునెలల కిందట లొంగదీసుకున్నాడు. అప్పటి నుంచి లైంగికదాడి చేస్తూనే ఉన్నాడు. బాలిక గర్భం దాల్చింది. తరచూ కడుపునొప్పి వస్తుందని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆదివారం దవాఖానలో చూపించారు. నాలుగు నెలల గర్భమని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. బాలికను ఏమైందని అడగ్గా, అసలు విషయం చెప్పింది. తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.