హైదరాబాద్: ప్రమాద బాధితులకు అపరసంజీవనిగా పేరుపడ్డ 108కు 290 కొత్తవాహనాల కొనుగోలుకు అనుమతినిస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ...
హైదరాబాద్: ప్రమాద బాధితులకు అపరసంజీవనిగా పేరుపడ్డ 108కు 290 కొత్తవాహనాల కొనుగోలుకు అనుమతినిస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.46.40 కోట్లను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాహనాల కోనుగోలు కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమించింది.
దీనికి చైర్మన్గా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వ్యవహరిస్తారు. జాతీయ ఆరోగ్య పథకం, జాతీయ అంబులెన్స్ సర్వీసుల నుంచి ఒక్కో ప్రతినిధి, ఐటీ (కమ్యూనికేషన్స్) జాయింట్ డైరెక్టర్, రాష్ట్రం వైద్యవిధాన పరిషత్ నామినేట్ చేసే అధికారి, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల డిప్యూటీ కార్యదర్శులు, జీవీకే, ఈఎంఆర్ఐలోని ఫ్లీట్ మేనేజ్మెంట్, సైప్లె చైన్, పీపీపీ విభాగాధిపతులు కమిటీలో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.