సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బుధవారం సాయంత్రం శాతవాహన ఎక్స్ ప్రెస్ రైల్లో విజయవాడ వెళ్లేందుకు కుటుంబం తో సహా ఒక వ్యక్తి 5వ నంబరు ప్...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బుధవారం సాయంత్రం శాతవాహన ఎక్స్ ప్రెస్ రైల్లో విజయవాడ వెళ్లేందుకు కుటుంబం తో సహా ఒక వ్యక్తి 5వ నంబరు ప్లాట్ ఫోరం పై వేచి ఉండగా హటాత్తుగా గుండెపోటు వచ్చింది.. ఎం చేయాలో పాలుపోని అతని బార్య మరియు 6 సంవత్సరాల కుమార్తె రైల్వే పోలీసులను, అక్కడ ఉన్న యువకులను సహాయం అడగడం తో ఆ యువకులు వచ్చి రైల్వే పోలీసులకు సమాచరం అందించి, 108 కి కాల్ చేసారు. సుమారు గంట సేపైనా 108 రాలేదు. అక్కడే ఉన్న రైల్వే ఆసుపత్రికి పోలీసులు బాదితున్ని తీసుకుని వెళ్ళచ్చు. కాని వారు కూడా ఏమి చేయకుండా అలాగే చూస్తుంది పోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన నలుగురు యువతులు జరిగిందంత తెలుసుకుని, పోలీసులను ఎదురు ప్రశ్నించి, బాదితున్ని అక్కడ ఉన్న యువకుల సహాయం తో ఆసుపత్రికి తరలించారు. సుమారు గంట సేపు ఈ తతంగం అంత జరిగిన పొలిసు ఉన్నత అధికారులెవరు సరిగా స్పందించలేదు. యువతులు బాదితున్ని మీరు పట్టించుకోకపోతే మేమైనా ఆసుపత్రికి తీసుకేలతామంటే సరే అని అన్నారు.. దీంతో రైల్వే పోలిసుల బాధ్యత ప్రయనికులపై ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కనీసం 108 అయిన సకాలం లో రైల్వే స్టేషన్ కి చేరుకోక పోవడం బాధాకరం. ఇకనైనా రైల్వే ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇలాంటి విషయాలపై ఒక్కసారి ఆలోచించిన వీటికి పరిష్కారం దొరికే ఆస్కారం ఉంది.
