హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కు...
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 12న పరామర్శిస్తారని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హన్మకొండకు వెళ్లి సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను జగన్ కలుస్తారని వెల్లడించారు.
డిసెంబర్ 23న హన్మకొండ మండలం తరాలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధీర్ రెడ్డి మృతి చెందారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్ లో వైఎస్ జగన్ పరామర్శించారు.
