మంచిర్యాల : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగనున్నాయని ఆర్ఐఓ ప్రభాకర్ తెలిపారు. ప్రాక్టికల్...
మంచిర్యాల : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరుగనున్నాయని ఆర్ఐఓ ప్రభాకర్ తెలిపారు. ప్రాక్టికల్స్ కోసం 111 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ కళాశాలలు 42, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు 6, సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు 7, మోడల్ స్కూల్ ఒకటి, 55 ప్రైవేటు కళాశాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో 6843 మంది ఎంపీసీ విద్యార్థులు, 7739 మంది బైపీసీ విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మ ధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తా మన్నారు. మొదటి విడత ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు, రెండో విడత 18 నుంచి 22 వరకు, మూడో విడత 23 నుంచి 27 వరకు, నాలుగో విడత 28 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
28న నైతిక విలువలపై పరీక్ష
మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 28న నైతిక, మనవ విలువలు, 31న పర్యావరణ విద్య పరీక్షలు ఉంటాయని, 22614 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాయనున్నారని ఆర్ఐఓ ప్రభాకర్ తెలిపారు.