-రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ -వారసత్వ ఉద్యోగం వద్దనుకునేవారికి సంస్థ ఆఫర్ రూ. 12.5 లక్షలు -నల్లసూర్యుల కూతుళ్లను చేసుకునేందుకు య...
-రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్
-వారసత్వ ఉద్యోగం వద్దనుకునేవారికి సంస్థ ఆఫర్ రూ. 12.5 లక్షలు
-నల్లసూర్యుల కూతుళ్లను చేసుకునేందుకు యువకుల క్యూ!
-ఉద్యోగం వచ్చేవారికి కట్నాలే కట్నాలు
మంచిర్యాల : ఒకప్పుడు సింగరేణిలో ఉద్యోగం ఇస్తామంటే మాకొద్దు బాబోయ్ అనేవారు. బొగ్గు బాయి ల ఎప్పుడు ఏ బండ మీదవడి సత్తమోనని భయపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సింగరేణిలో ఉద్యోగమా.. అబ్బ ఎంత అదృష్టమోనని మాట్లాడుకుంటున్నారు. ఏకంగా రూ.20లక్ష ల దాకా పోసి ఉద్యోగం కొనుక్కునేందుకు ముం దుకొస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యో గం.. యంత్రాలపై పనిచేయడం.. సకల సదుపాయాలు ఉండడంతో నళ్లసూర్యుల అవతారమెత్తేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
-సాఫ్ట్వేర్ స్థాయిలో జీతాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణిలో క్రమంగా తట్టా, చెమ్మాస్ కనుమరుగవుతుండడం, యంత్రీకరణ పద్ధతులు పెరగడం, సాఫ్ట్వేర్ స్థాయిలో జీతాలు లభిస్తుండడం తో ఇప్పుడు ఈ సంస్థలో ఉద్యోగం ఓ స్టేటస్ లా మారింది. ఈ కారణంగానే ప్రస్తుతం మార్కెట్లో సింగరేణి ఉద్యగం రూ.20లక్షలకు పైనే పలుకుతోంది. మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుడు గా నీ, లేదా చనిపోయిన కార్మికుడి కుటుంబం గానీ ఉద్యోగం వద్దనుకుంటే కొంత కాలం క్రితం దాకా ఇచ్చిన రూ.5లక్షలను రూ.12.5లక్షలకు పెంచు తూ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఇ టీవల సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌తో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థలో మెడికల్ అన్‌ఫిట్ తో రిటైరైన కార్మికులకు తోడుగా వివిధ కారణాల తో సర్వీసులో ఉండి మృతి చెందిన వారి కొడుకు లేదా అల్లుడికి ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ కొనసాగుతోంది.
ఈ పద్ధతిలో వస్తున్న ఉద్యోగానికి భారీగా డిమాండ్ ఉండడంతో పాటు సింగరేణి ఉద్యోగం వచ్చే అవకాశముంటే ఆ కుటుంబం చుట్టూ పెళ్లి సంబంధం కోసం చక్కర్లు కొడుతున్నారు. అన్‌ఫిట్ లేదా చనిపోయిన కార్మికుడి కు టుంబంలో కూమారుడు లేదా అల్లుడికి ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ ఉండడంతో సింగరేణి ఉ ద్యోగం ఇస్తే అన్ని మేమే చూసుకుంటాం.. నయాపైసా కట్నం అవసరం లేదు అంటూ పెళ్లి కొడుకుల తల్లిదండ్రులూ ప్రదక్షిణ చేస్తున్నారు. కార్మికుడి కొడుక్కి ఉద్యోగం వచ్చే అవకాశముంటే ఆడ పిల్లల తండ్రులూ క్యూ కడుతున్నారు. కట్నం రూ.10 లక్షల నుంచి ప్రారంభమై వేలం పాటలా సాగి రూ.25లక్షలు, రూ.30లక్షల దాకా పలుకుతోంది. కట్నంతో పాటు కానుకలూ భారీగానే ఇచ్చేందుకు సిద్ధమవుతూనే గ్రాండ్‌గా వివాహం జరిపిస్తామని హామీ ఇస్తున్నారు. కొంత మంది మాకు ఉద్యోగం అమ్మండి మిగతా విషయాలు మేం చూసుకుంటాం అంటూ ముందుకొస్తున్నారు.
నిన్న, మొన్నటి దాకా రూ.15 లక్షల నుం చి రూ.18 లక్షల దాకా పలికిన ఉద్యోగం ధర నేడు రూ.20 లక్షలు దాటిపోయింది. వారసత్వ ఉ ద్యోగం వద్దనుకుంటే సింగరేణి సంస్థ సైతం రూ. 12.5 లక్షలు ఆఫర్ చేయడంతో తమకు ఎక్కువ గిట్టుబాటు కావాలని సదరు కార్మికులు చూస్తున్నారు. సింగరేణి సంస్థలో మెడికల్ అన్ఫిట్లు చే సుకునేందుకు అనేక మంది పైరవీలు కూడా చేస్తున్నారు. రూ.3లక్షల నుంచి రూ.5 లక్షల దాకా ఖ ర్చు చేసైనా అన్‌ఫిట్ సర్టిఫికెట్లు సంపాదిస్తున్నా రు. సింగరేణి సంస్థలో మొదటి క్యాటగిరీ కార్మికు డి బేసిక్ రూ.16 వేలు ఉండడంతో పాటు ప్రారంభంలోనే రూ.30 వేల దాకా జీతం వచ్చే అవకాశం ఉండడంతో ఈ ఉద్యోగాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు.
2016లో బొగ్గు గని కార్మికులకు మరో వేజ్‌బోర్డు అమలు కానుండడంతో అప్పుడు సింగరేణి కార్మికుడి మొదటి క్యాటగిరీ జీతం రూ.50వేల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీనియర్ కార్మికులకైతే రూ.లక్షకు పై బడి జీతం వచ్చే అవకాశాలుండగా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోని భద్రతతో పాటు జీవితాన్ని హాయిగా గడపొచ్చని భావిస్తున్న వారు సైతం సింగ రేణివైపు చూస్తున్నారు. నిర్ధిష్ట విద్యార్హతలు లేకపోవడంతో ఎంత చదువుకున్న వారైనా ఈ ఉద్యోగాల కోసం ముందుకొస్తున్నారు. సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో సింగరేణి అనుకున్న మేర అభివృద్ధి సాధించకపోవడం, తెలంగాణలో భారీగా విస్తరించే అవకాశాలుండడంతో ఇందులో ఉద్యోగాలకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది.