కొత్తగూడెం : ఆర్మీ ఎంపికలకు ఖమ్మం జిల్లా కొత్తగూడెం మరోసారి వేదిక కానుంది. ఇక్కడి సింగరేణి స్టేడియం గ్రౌండ్లో వచ్చేనెల 4వ నుంచి 12వ వర...
కొత్తగూడెం : ఆర్మీ ఎంపికలకు ఖమ్మం జిల్లా కొత్తగూడెం మరోసారి వేదిక కానుంది. ఇక్కడి సింగరేణి స్టేడియం గ్రౌండ్లో వచ్చేనెల 4వ నుంచి 12వ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. కొత్తగూడెంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏజేసీ బాబూరావు, ఆర్మీ రిక్రూట్మెంట్ ఏఆర్వో కర్నా రోహిల్లా, ఆర్మీ అధికారులు మహేందర్ సింగ్, సంతోష్, కొత్తగూడెం ఆర్డీవో అమయ్కుమార్లు సమావేశమై ఎంపిక కార్యాచరణపై చర్చించారు.
18 నుంచి 23 ఏండ్లలోపు వయస్సున్న అభ్యర్థులు అర్హులని, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్ ఎస్కేటీ, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ట్రేడ్స్మెన్, హవల్దార్ ఎడ్యుకేషన్ రిలీజియస్ టీచర్ కేటగిరీల్లో నియామకాలు చేపడుతామని అధికారులు ప్రకటించారు. పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ అభ్యర్థులు అర్హులని,ఇంజినీరింగ్ విద్యార్థులు బోనఫైడ్ సర్టిఫికెట్ తేవాలని సూచించారు. పరుగు పందెం, శారీరక ధారుఢ్యం, మెడికల్ టెస్టుల్లో అర్హత సాధించాక రాత పరీక్ష నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. అభ్యర్థులు ఎవరూ దళారులను నమ్మవద్దని అధికారులు సూచించారు.