సికింద్రాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టారు. సికింద్రా...
సికింద్రాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టారు. సికింద్రాబాద్ మార్కెట్ వద్ద చేపట్టిన సోదాల్లో ఓ వ్యక్తి వద్ద నుంచి నాలుగు కేజీల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని రూ. 50 లక్షల విలువైన సెల్ఫోన్లను, 42 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.