హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా అబ్దుల్ ఖయ్యూం ఖాన్(ఏకేఖాన్)ను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల...
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా అబ్దుల్ ఖయ్యూం ఖాన్(ఏకేఖాన్)ను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అఖిల భారత సర్వీసుల అధికారుల కేటాయింపులో భాగంగా ఏకే ఖాన్‌ను తెలంగాణకు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏసీబీ డీజీగా పనిచేసిన ఏకే ఖాన్ సోమవారం రిలీవ్ అయి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే రాష్ట్ర ఏసీబీ డీజీగా ఏకే ఖాన్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం జీవో జారీచేసింది. 1981వ బ్యాచ్‌కు చెందిన ఏకే ఖాన్ నగర కమిషనర్ పనిచేశారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా పనిచేసి డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతిపై ఏసీబీకి బదిలీ అయ్యారు. అదే శాఖకు తెలంగాణ రాష్ట్రంలో అధిపతిగా నియమితులవడంపై ఐపీఎస్ అధికారుల, పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తంచేశారు.