-500 కోట్లతో ఏర్పాటు చేస్తాం : మంత్రి జన్నారం : అడవుల రక్షణతో పాటు జంతువులు బయటకు రాకుండా ఉండేందుకు 500 కోట్ల నిధులతో కంచెను ఏర్పాటు ...
-500 కోట్లతో ఏర్పాటు చేస్తాం : మంత్రి
జన్నారం : అడవుల రక్షణతో పాటు జంతువులు బయటకు రాకుండా ఉండేందుకు 500 కోట్ల నిధులతో కంచెను ఏర్పాటు చేయిస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్‌రావు ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అడవుల్లో పండ్ల చెట్లు లేకపోవడంతోనే గ్రామాల్లోకి కోతులు, అడవి పందులు వస్తున్నాయని వాటిని నివారించేందుకు రూ.18 కోట్లు ఖర్చవుతుందని వాటికి వ్యాక్సిన్ ఇప్పించేందుకు ప్రణాళికను తయారుచేస్తున్నామని పేర్కొన్నారు. అట వీ రక్షణ కోసం అటవీశాఖలో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
అటవీ చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని స్మగ్లర్లు వేటగాళ్లు చెట్లను నరుకుతూ జంతువులను హతమారుస్తున్నారని వీరిని అదుపు చేసేందుకు కొత్త చట్టాలను తయారు చేసి రెండుసార్లు పట్టుబడ్డ వ్యక్తులను పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో వేసేందుకు యాక్ట్‌ను తీసుకొస్తామన్నారు. 2005 కన్నా ముందు అటవీ భూ ముల్లో సాగు చేసుకుంటున్న వారికి భూములు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఇప్పటికి వైఎస్సార్ ప్రభుత్వం కేంద్రం ఇప్పటికే అటవీ భూ ములను పార్టీల నాయకులకు కట్టబెట్టారని ఎవరైతే అర్హులున్నారో వారికి ఇవ్వకుండా భూములను తీసుకున్నారని అర్హులైన వారికి భూముల ను ఇవ్వడం ప్రత్యామ్నయ మార్గం చూపేందు కు అధికారులతో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం మంత్రిని మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ భరత్‌కుమార్, సీహెచ్ సత్యంలు శాలువా కప్పి సన్మానించారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ దామోదర్‌రెడ్డి, మహిళా నాయకురాలు కాంతామణి, శంకర్ దాసరి సత్యం, జనార్ధన్, జగన్ పాల్గొన్నారు.