వరంగల్ : వినియోగదారులు కోరుకున్న వస్తువులను తక్కువ ధరకు ఇంటి ముంగిటకు తెచ్చిస్తాం.. మిస్డ్‌కాల్ చేస్తే చాలు.. మీ అడ్రస్‌కు మేమే వస్తు...
వరంగల్ : వినియోగదారులు కోరుకున్న వస్తువులను తక్కువ ధరకు ఇంటి ముంగిటకు తెచ్చిస్తాం.. మిస్డ్‌కాల్ చేస్తే చాలు.. మీ అడ్రస్‌కు మేమే వస్తువులను అందించి డబ్బులు తీసుకుంటామని నిత్యం ఛానళ్లలో, పత్రికల్లో విస్తృత ప్రచారం చేస్తున్న కంపెనీలను చూస్తుంటాం.
ప్రకటనలు నమ్మి తక్కువ ధరకే ఏడు ఖరీదైన చీరలు వస్తాయన్న ఆశతో మిస్డ్‌కాల్ చేసిన జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచకు చెందిన పలువురు మోసపోయారు. పోస్టుమ్యాన్ ఓ బ్యాగ్ తీసుసుకుని ఇంటి ముందుకు రావడంతో చీరలు వచ్చాయన్న సంతోషంతో రూ.2400 చెల్లించి బ్యాగ్ విప్పి చూస్తే చీరల స్థానంలో చిత్తుకాగితాలు రావడంతో అవాక్కయ్యారు.
కొమ్ములవంచకు చెందిన పలువురు మహిళలు ఈ నెల రెండో తేదీన తక్కువ ధరకే ఖరీదైన చీరలు వస్తాయన్న ఆశతో టీవిలోవచ్చిన నెంబర్‌కు మిస్డ్‌కాల్ చేసి చీరలను బుక్ చేసుకున్నారు. దీంతో పోస్టుమ్యాన్ తీసుక వచ్చిన బ్యాగ్‌కు రూ.350 చొప్పున మొత్తం ఏడుగురు రూ.2400 చెల్లించి బ్యాగ్‌ను విప్పి చూస్తే చిత్తు కాగితాలు లభించాయి.