-దీన్‌దయాల్‌నగర్, ప్రగతినగర్, నాగేంద్రనగర్, జితేంద్రనగర్ కాలనీల్లో పర్యటించిన సీఎం.. -కాలనీల వాసుల సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత...
-దీన్‌దయాల్‌నగర్, ప్రగతినగర్, నాగేంద్రనగర్, జితేంద్రనగర్ కాలనీల్లో పర్యటించిన సీఎం..
-కాలనీల వాసుల సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి
-అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలు ఇచ్చే వెళ్తా..
-రేపు, ఎల్లుండి ఇళ్ల వద్దనే ఉండాలంటూ వేడుకోలు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాలోని మురికివాడల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం వరంగల్ పశ్చిమలోని దీన్‌దయాల్‌నగర్, ప్రగతినగర్, నాగేంద్రనగర్, జితేంద్రనగర్ కాలనీలను డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దా స్యం వినయ్‌భాస్కర్, జిల్లాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ కిషన్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో కలిసి సం దర్శించారు.
కాలనీలలో ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పలుకరించారు. సుమారు గంటపాటు కాలనీల్లో కలియతిరిగారు. దీనదయాల్నగర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసి న సభావేదిక వద్దకు మహిళల మధ్యలోకి వెళ్లి కూర్చున్నా రు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ కాలనీ సమస్యలు, వారు పడుతున్న పాట్లు అడిగి తెలుసుకున్నారు. రోడ్లన్నీ మురికి కూపంగా ఉన్నాయన్నారు. వర్షం వస్తే మురుగునీరంతా ఇళ్లలోకి చేరుతుందని సీఎంకు వివరించారు. డీలర్ ఉండడంలేదని, ఒక్కరోజే బియ్యం ఇచ్చి వెళ్లిపోతున్నాడని, డీలర్‌ను మార్చాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. డీలర్ల సమస్య తెలంగాణలో ఎక్కడా లేదు.. ఒక్క వరంగల్‌లోనే ఉంది.. నిన్న వరంగల్‌కు వెళ్లితే అక్కడా ఇదే సమస్యను చెప్పారు.. ఇక్కడ అదే సమస్యను చెబుతున్నారు అంటూ వారి సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించారు.
నేను వస్తున్నానే రాత్రికి రాత్రే రోడ్డుపై మొర్రంపోసి రోలర్‌తో తొక్కించారు.. కాబట్టే ఈ మాత్రం ఉన్నాయి లేకుంటే నడవడమే కష్టంగా ఉండేదని సీఎం వివరించారు. కాలనీల్లోని ప్రజల కు ఎక్కడి వారికి అక్కడే పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.అవసరమైతే ఇళ్లు లేని వారికి ఆజంజాహిమిల్లుకు సంబంధిచిన 39ఎకరాల భూమి ఉందని, అక్కడ ఇళ్లు నిర్మిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
-రేపు, ఎల్లుండి ఇళ్ల వద్దనే ఉండండి..
మీ సమస్యలు తెలుసుకున్నాను. నేనొక విషయం చెబు తున్నాను.. మంచిగా వినండి.. రేపు, ఎల్లుండి రెండు రోజు లపాటు పనులన్నింటినీ వదిలిపెట్టుకుని ఇంటిదగ్గరే ఉండా లని సీఎం కేసీఆర్ కాలనీవాసులకు సూచించారు. హైదరా బాద్, ఇతర జిల్లాల నుంచి అధికారులను మీ వద్దకు పిలిపిస్తున్నాను. ఈ రోజే ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. వారు వెంటనే జిల్లాకు వస్తారు. మీరు అన్ని విషయాలను మీ వద్దకు వచ్చిన అధికారులకు తెలియజేయాలని సీఎం కాలనీ వాసులకు చెప్పారు. ఇంటి ముందు ఫొటో దిగి ప్రతి కుటుంబం వివరాలను ఓ రిజిస్టర్లో నమోదు చేసి దగ్గర పెట్టుకోవాలన్నారు. కాలనీ అభివృద్ధికి ఓ కమిటీని నిర్మా ణం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ 50 బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తారు. అధి కారులు వచ్చినప్పుడు ఇంటి వద్దనే ఉండి పూర్తి వివరాలను అందజేయాలని ముఖ్య మంత్రి వివరించారు.
-ఎల్లుండి వచ్చి పట్టాలు ఇస్తాను..
కాలనీల్లో నివాసం ఉంటున్నవారందరికీ పట్టాలు ఇ స్తాం. రేపు అధికారులు మీ పూర్తి వివరాలను తీసుకుం టారు.మీ అందరికీ పట్టాలను తయారు చేయిస్తాను..స్వ యంగా ఎల్లుండి నేనే వచ్చి ఇళ్ల పట్టాలను ఇస్తా అని సీఎం ప్రకటించారు. అదేవిధంగా అర్హులై ఉండి పింఛన్లు రాని వా రందరికీ కూడా తానేస్వయంగా అందజేస్తానని స్పష్టం చేశా రు.అర్హులైన ప్రతిఒక్కరికీ పథకాలు అందాలన్నారు. అన ర్హులను మీరే గుర్తిం చాలని ప్రజ లకు కేసీఆర్ సూచించారు.
-కాలనీలకు శంకుస్థాపన చేస్తా..
జిల్లాలో 180 వరకు మురికివాడలు ఉన్నాయి.. అన్నిం టినీ దశలవారీగా అభివృద్ధి చేసుకుందామని సీఎం కాల నీవాసులతో అన్నారు. మొదటి విడతలో ఈ ఏడాది వరం గల్ తూర్పులో మూడు కాలనీలు, వరంగల్ పశ్చిమలో మూడు కాలనీలను అభివృద్ధి చేస్తామన్నారు. రేపు ఎల్లుండి ఇక్కడే ఉంటున్నాను.. ఎల్లుండి వచ్చి మీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. వన్ ప్లస్‌వన్ పద్ధతిలో ఇళ్లను నిర్మిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఇ ళ్లు ఇవ్వాలి.. ఇళ్ల స్థలం ఉన్నవారికి గ్రౌండ్‌ప్లోర్‌లో, లేనివా రికి పైఫ్లోర్‌లో ఇస్తామన్నారు. అవసరమైతే లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయిస్తామన్నారు. నాలుగు, ఐదునెలల్లో ఇళ్ల ని ర్మాణం పూర్తి కావాలి.. అటాచ్బాత్రూమ్తో కూడిన బెడ్ రూమ్, మరో బెడ్‌రూమ్‌తోపాటు హాల్, కిచెన్తోకూడిన ఇ ళ్లను నిర్మిస్తామన్నారు. నాలుగు లక్షల ఖర్చయినా సరే ఇళ్లు కట్టించి తీరుతామన్నారు. ఇళ్లు నిర్మాణం పూర్తైన తరువాత గృహ ప్రవేశానికి వస్తా.. బ్రహ్మండగా దావత్ చేసుకుం దామంటూ కేసీఆర్ చమత్కరించారు.
