సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు {పారంభమైన నగర మహాసభలు నగరంలోని ఖిలా వరంగల్ బతుకమ్మ ఆట స్థలంలో సీపీఎం నగర 18వ మహాసభ సోమవా...

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
{పారంభమైన నగర మహాసభలు
నగరంలోని ఖిలా వరంగల్ బతుకమ్మ ఆట స్థలంలో సీపీఎం నగర 18వ మహాసభ సోమవారం జరిగింది. తొలుత రైల్వే స్టేషన్ నుంచి ఖిలా వరంగల్ సభా స్థలి వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పార్టీ అనుబంధ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కళాకారులు విప్లవ గీతాలు ఆలపిస్తూ.. నినాదాలు చేశారు. సభకు ముఖ్యఅతిథిగా ఆ పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హాజరై ప్రసంగించారు. భవిష్యత్‌లో వామపక్షాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు.
- ఖిలా వరంగల్
ఖిలా వరంగల్ : ప్రజా సమస్యల కోసం పో రాడుతున్న 11 వామపక్షాలను ఐక్యం చేసి భవిష్యత్‌లో ఐక్య సమాఖ్య ఏర్పాటు ద్వారా ఉద్యమాలు చేపట్టనున్నట్లు సీపీఎం కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు తె లిపారు. సీపీఎం నగర 18వ మహాసభలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఖిలా వరంగల్ బతుకమ్మ ఆట స్థ లంలో నగర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారం లో ఉన్న పాలకులు పేద ప్రజల సంక్షేమం వి స్మరించి ప్రపంచబ్యాంకుకు దాసులయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ రైతుల రుణాలు మాఫీ చేయకుండా, విద్యుత్, సాగునీటి సమస్యలు పరిష్కరించకుండా బంగారు తెలంగాణ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు డబుల్ బెడ్రూమ్ ప్లాట్ల మాటేమో కాని తొలుత పేదలకు 60 గజాల స్థలానికి పట్టాలు మం జూరు చేయాలని సవాల్ విసిరారు.
సమస్యలపై చర్చిస్తాం..
సీపీఎం రాష్ర్ట స్థాయి మహాసభలు ఏప్రిల్ 14 నుంచి జరగనున్నాయని.. ఆ సభల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించి సమస్యలపై పోరాడేందుకు కార్యాచరణ రూ పొందించనున్నట్లు రాఘవులు వెల్లడించారు. పార్టీ జిల్లా కార్యద ర్శి నాగయ్య మాట్లాడుతూ నగరంతో పాటు పేదల సమస్యలపై పోరాడే క్రమంలో నిర్బంధాలు ఎదురైనా వెరవని పా ర్టీగా సీపీఎంకు గుర్తింపు ఉందని తెలిపారు. సమావేశంలో కల్లెపు వెంకటయ్య, సూడి కృ ష్ణారెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్, టి.ఉప్పల య్య, బోగి సురేష్, పల్లం రవి, రత్నమాల, కాసు మాధవి, స్కైలాబ్, సింగారపు బాబు, యాదగిరి, ప్రవీణ్, రామస్వామి, లింగయ్య, బిక్షపతి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఎర్రదండు ర్యాలీ
సీపీఎం మహాసభల సందర్భంగా నిర్వహిం చిన రెడ్ షర్ట్ వలంటీర్ల భారీ ర్యాలీ ఆకట్టుకుంది. వరంగల్ స్టేషన్ నుంచి ఖిలావరంగ ల్ వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీకి ముందు భాగంతో పాటు సభా వేదికపై పీఎన్ఎం కళాకారులు, పార్టీ కార్యకర్తలు పాడిన పాటలు, ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.