యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియా మెయిన్ స్టోర్స్ ముందు ఎక్స్‌ప్లోజివ్ లారీలు నిలిపివేసే ప్రాంతంలో భూమిలోంచి అకస్మాత్...

యైటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియా మెయిన్ స్టోర్స్ ముందు ఎక్స్‌ప్లోజివ్ లారీలు నిలిపివేసే ప్రాంతంలో భూమిలోంచి అకస్మాత్తుగా పొగలతో మంటలు వచ్చాయి. చల్లటి వాతావరణ ఉన్న సమయంలో మంటలు రావడంతో ఎక్స్‌ప్లోజివ్ లారీ డ్రైవర్లు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సింగరేణి అధికారులకు సమాచారం అందించారు. అక్కడ ఉన్న లారీలను బయటకు తీసివేయించి రెస్క్యూ సిబ్బందిని రప్పించారు. రెస్క్యూ సిబ్బంది ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిశితంగా పరిశీలించారు.
భూమిలో ఏమైనా పగుళ్లు ఉన్నాయా అని గమనించారు. సర్వే సిబ్బందిని పిలిపించి కింద బొగ్గుగని గ్యాలరీలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. గ్యాలరీలు లేవని నిర్ధారణకు రావడంతో పాటు గతంలో బొగ్గు కుప్పలు పోసి మట్టిని డోజింగ్ చేయడం వల్ల ఆబొగ్గు అంటుకుని ఈవిధంగా జరిగిందని తేల్చి చెప్పారు.

దీంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్జీ-2 జీఎం సుభాని, ఏరియా సేఫ్టీ అధికారి మధుసూధన్, రెస్క్యూ మేనేజర్ సలీం, స్టోర్స్ డీజీఎం ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.