భూపాలపల్లి రూపురేఖలు మారుద్దాం...

-రెవెన్యూ డివిజన్‌గా భూపాలపల్లి -3ః45గంటల పాటు సాగిన సీఎం పర్యటన -స్పీకర్ నియోజకవర్గంపై ప్రత్యేక నజర్ -100పడకల ఆస్పత్రి మంజూరు ...


-రెవెన్యూ డివిజన్‌గా భూపాలపల్లి
-3ః45గంటల పాటు సాగిన సీఎం పర్యటన
-స్పీకర్ నియోజకవర్గంపై ప్రత్యేక నజర్
-100పడకల ఆస్పత్రి మంజూరు
-అన్ని హంగులతో బస్టాండ్ ఏర్పాటు
-మండల కేంద్రాలు, ఊరురా బస్టాండ్‌లు
-రేగొండ, భూపాలపల్లి, చిట్యాలలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాలు
-మోరంచ, చలివాగులపై ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు తయారు చేయండి
-భూపాలపల్లి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్
ములుగు : స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. శుక్రవారం నియోజకవర్గ సమీక్షా సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. వరంగల్ అర్చక మహాసభలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ 1ః14గంటలకు కేటీపీపీ ప్రాంతానికి హెలికాప్టర్‌లో వచ్చారు. భూపాలపల్లి పట్టణం, కేటీపీపీ, బొగ్గుగనులు, గణపసముద్రం ప్రాంతాలపై ఏడు నిమిషాలపాటు ఏరియల్ సర్వే నిర్వహించారు. 1ః21గంటలకు కేటీపీపీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో సీఎం హెలికాప్టర్ లాండ్ అయ్యింది. 1ః28గంటల నుంచి 2ః00గంటల వరకు లంచ్‌బ్రేక్ తీసుకున్నారు.

అనంతరం 2ః12గంటలకు స్పీకర్, డిప్యూటీ సీఎంలతో కలిసి సభావేదిక మీదికి వచ్చారు. 2ః14గంటలకు ప్రారంభమైన సమీక్ష సమావేశం 4ః15గంటల వరకు సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. ముఖ్యంగా ఆరు శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, విద్యుత్, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించి భూపాలపల్లి నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపించారు. పార్టీలకతీతంగా నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, 

జడ్పీటీసీలతో పాటు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నవ్వుతూ నవ్విస్తూ ఎదుటి వాళ్లను నవ్విస్తూ ఆకట్టుకున్నారు. పల్లెల అభివృద్ధి స్థానిక ప్రజాప్రతినిధుల చేతిలోనే ఉందని, అందుకు రాజకీయాలకతీతంగా అందరూ ముందుకు రావాలని కోరారు. 

రెవెన్యూ డివిజన్‌గా భూపాలపల్లి 
భూపాలపల్లిని ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భూపాలపల్లిలో 100పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని హంగులతో రూ.1కోటి 75లక్షల అంచనా వ్యయంతో బస్టాండ్‌ను మంజూరు చేశారు. సింగరేణి, జెన్‌కో సాకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో బస్టాండ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. సుమారు రూ.120కోట్ల వ్యయం తో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు మరమ్మతు, తారు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 

ఆరు డబుల్ రోడ్ల కోసం రూ35కోట్లు... 
ఆరు డబుల్ రోడ్లను మంజూరు చేశారు. ఇందుకుగానూ సుమారు రూ.35కోట్లను అక్కడికక్కడే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మొగుళ్లపల్లి, చిట్యాల, చెల్పూర్, కొత్తపల్లి, వెల్తుర్లపల్లి, గుర్రంపేట, శాయంపేట, మాందారిపేట, రూపురెడ్డిపల్లి, కటాక్షాపురం, రేగొండ, పరకాల వయా కనపర్తి, రేపాక రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని సుమారు 1000కిలోమీటర్ల రహదారులను క్రమంగా బిటీ రోడ్లుగా మార్చాలని సూచించారు. ఈ రోడ్డుమార్గాల్లో 278బ్రిడ్జిలు అవసరమని, వీటిని దశలవారీగా మంజూరు చేస్తామని తెలిపారు. తక్షణ అవసరమున్న 15బ్రిడ్జిలల్లో రూ.5కోట్ల లోపు ఉన్న బ్రిడ్జిలన్నింటినీ వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సిరిసేడు-మొగుళ్లపల్లి మధ్య 12కిలోమీటర్ల కొత్త రోడ్డు మంజూరు చేశారు. రేగొండ-జాకారం మధ్య 18కిలోమీటర్లు రూ.20కోట్లతో డబుల్ రోడ్డు మంజూరైంది.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: భూపాలపల్లి రూపురేఖలు మారుద్దాం...
భూపాలపల్లి రూపురేఖలు మారుద్దాం...
http://bhupalpally.weebly.com/uploads/6/8/5/1/6851838/4590320.jpg?388
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/01/blog-post_2.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/01/blog-post_2.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy