కందకుర్తి నుంచి భద్రాచలం వరకు 80 ఘాట్లు హైదరాబాద్: గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర యంత్రాంగం విస్తృత ఏర్పా ట్లు చేస్తున్నది. ఆ...
కందకుర్తి నుంచి భద్రాచలం వరకు 80 ఘాట్లు
హైదరాబాద్: గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర యంత్రాంగం విస్తృత ఏర్పా ట్లు చేస్తున్నది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. గోదావరి తీరంలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రచించారు. గోదావరి నది తెలంగాణలో ప్రవేశించే కందకుర్తి నుంచి భద్రాచలం వరకు తెలంగాణ సాంస్కృతిక చైతన్యం, ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా ఏర్పాట్లు ఉండేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో 14 శాఖలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. శైవక్షేత్రాలను శివరాత్రి నాటికి, వైష్ణవ క్షేత్రాలను శ్రీరామనవమి నాటికి ముస్తాబు చేయనున్నారు. స్నానఘట్టాల సంఖ్యను 80 వరకు పెంచాలని నిర్ణయించారు.