ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరిగే గణతంత్ర వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చ...
ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరిగే గణతంత్ర వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమాలకు అందుకు తగ్గట్లుగా వేదికను సిద్ధం చేస్తున్నారు. జిల్లా అదనపు ఎస్పీ సాయిక్రిష్ణ ఆధ్వర్యంలో ఏఆర్ డీఎస్పీ సంజీవ్ ఏర్పాట్లును పరిశీలిస్తున్నారు. గ్రౌండ్లో వేదికపై తెలంగాణ రాజముద్ర, పోలీసు లోగో, జిల్లా పోలీసు లోగోను ఏర్పాటు చేశారు.
సాయుధ పోలీసులు ఇప్పటికే రిపబ్లిక్ పరేడ్‌ను రీహార్సల్స్ చేస్తున్నారు. గ్రౌండ్లోకి వచ్చే వివిధ ప్రభుత్వ శాఖ శకటాలు ఎక్కడెక్కడ నిలిపి ఉంచాలో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా అతిథులు, వేడుకలకు హాజరయ్యే వారికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఏఆర్ అధికారులు, సిబ్బంది రిపబ్లిక్‌డే వేడుకలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు వారి విధుల్లో నిమగ్నమయ్యారు.