హైదరాబాద్: గోపాల గోపాల ఆడియో వేడుకలో గుర్తు తెలియని దుండగుల చేతిలో గాయపడిన అభిమానిని సినీహీరో పవన్‌కళ్యాణ్ పరామర్శించారు. తన అభిమాని ...
హైదరాబాద్: గోపాల గోపాల ఆడియో వేడుకలో గుర్తు తెలియని దుండగుల చేతిలో గాయపడిన అభిమానిని సినీహీరో పవన్‌కళ్యాణ్ పరామర్శించారు. తన అభిమాని కరుణ శ్రీనివాస్‌కు అయిన వైద్యఖర్చులను చెల్లించిన పవన్ అతనికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈసందర్భంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పవన్ దాదాపు గంటకు పైగా ముచ్చటించారు. గోపాల గోపాల ఆడియో వేడుకలో గుర్తు తెలియని దుండగులు శ్రీనివాస్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.