-అభివృద్ధికి పెద్దపీట వేస్తా -బంగారు తెలంగాణకు చిత్తశుద్ధితో కృషి -త్వరలో సీఎంతో టెక్స్టైల్ పరిశ్రమకు శంకుస్థాపన -సీఎంవో బాధ్యతల...
-అభివృద్ధికి పెద్దపీట వేస్తా
-బంగారు తెలంగాణకు చిత్తశుద్ధితో కృషి
-త్వరలో సీఎంతో టెక్స్టైల్ పరిశ్రమకు శంకుస్థాపన
-సీఎంవో బాధ్యతల్లో ఉన్నా.. మనసంతా జిల్లా పైనే
-ఆత్మీయ సన్మాన సభలో పార్లమెంటరీ కార్యదర్శి
జిల్లాపరిషత్/ మట్టెవాడ: సమైక్య ప్రభుత్వంలో ఎన్నో అవమానాలను భరించాం. నా రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చివిచూశా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009లో ఎమ్మెల్యేనని చూడకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. తెలంగాణ రైతులకు విద్యుత్ కావాలని విద్యుత్‌సౌధను ముట్టడిస్తే ఆక్టోపస్ దళాలతో దాడు చేయించారు. అసెంబ్లీలో మా అన్న ప్రణయ్‌భాస్కర్ తెలంగాణ పదాన్ని ఉచ్ఛరిస్తే దానిని నిషేంధించారు. అలాంటి స్థితి నుంచి అన్నింటిని భరిస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ర్టాన్ని బంగా రు తెలంగాణగా తీర్చిదిద్దుకుందామని పార్లమెంటరీ కార్యదర్శి (సీఎంవో) దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు.
సమైక్య రాష్ట్రంలో కాళోజీ కళాక్షేత్రానికి 300 వందల గజాల స్థలం కోసం మూడేళ్లు తిరిగామన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే కాళోజీ కళాక్షేత్రానికి మూడున్నర ఎకరాల భూమి, రూ.10కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారన్నారు. శనివారం ములుగు రోడ్‌లోని వెంకటేశ్వర గార్డెన్లో టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ అధ్యక్షతన వినయ్‌భాస్కర్‌కు సన్మానసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సహకారంతో వరంగల్ నగరాన్ని గుడిసెలు లేని స్మమ్ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుతానని వినయ్‌భాస్కర్ అన్నారు. వరంగల్‌లో ప్రత్యక్షంగా 10వేల మంది చేనేత కార్మికులకు, పరోక్షంగా 30వేల మందికి ఉపాధి కల్పించే అజంజాహీ మిల్లును ఒక ప్రభుత్వం మూసేస్తే మరో ప్రభుత్వం ఉన్న భూములను అమ్ముకుందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వలస వెళ్లిన చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందు కోసం త్వరలో టెక్స్టైల్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి నాలు గు రోజులపాటు వరంగల్ నగరంలో ఉండి మురికివాడలను పరిశీలించి ఆరు కాలనీల్లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వడంతోపాటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ఎంపీలు కడియం శ్రీహ రి, సీతారాం నాయక్ వరంగల్‌కు హెరిటేజ్ సిటీ కింద రూ.40 కోట్ల నిధులను మంజూరు చేయించారన్నారు. కాజీపేటను డివిజన్‌గా చేయడంతోపాటు కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కృషి చేశారన్నారు.
చిల్లర రాజకీయాలు చేయకండి..
నగరంలోని మురికివాడలను స్లమ్‌ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడానికి సీఎం కృత నిశ్చయంతో ముందుకు పోతున్నారని అన్నా రు. ఇప్పటి వరకు గుడిసెవాసుల సమస్యలు పట్టించుకోని వారు ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజునుంచే చిల్ల ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా వాటిని మానుకుని అభివృద్ధికి సహకరించాలని వినయ్‌భాస్కర్ విజ్ఞ ప్తి చేశారు. పార్టీలు, రాజకీయాలు పక్కకు పెట్టి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. నగరంలో ఉన్న నిరుపేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించడంతోపాటు అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం వికలాంగులకు రూ.1,500, వృద్ధులు, వితంతువులకు రూ.1000 పింఛన్లను ఇస్తున్నామన్నారు.
కార్యకర్తలు కాదు.. కుటుంబ సభ్యులు
టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లంత కార్యకర్తలు కాదని వారంతా తన కుటుంబ సభ్యులని వినయ్‌భాస్కర్ అన్నారు. ఉద్యమ కాలం లో తనను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, వారిని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నా రు. సీఎంవో కార్యాలయం బాధ్యతలు నిర్వహిస్తున్నా తన మనసంతా జిల్లాపైనే ఉం టుందన్నారు. సీఎంవో కార్యాలయం అటాచ్ అంటనే కార్యకర్తలతో డిస్పా చ్ అనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సన్మానసభ లో ధార దేవేందర్ కళాబృందం పాటలు అలరించాయి. వినయభాస్కర్కు వేదపండితులు గుదిమెల్ల విజయ్‌కుమార్ ఆచార్య,
ఆయన శిశ్య ఘనంతో ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భం గా వినయభాస్కర్కు గజమాలతో సత్కరించి ఖడ్గం, వెండి కిరీటం అందజేశారు. కేయూ విద్యార్థి గౌని యాదగిరి అనే వికలాంగుడు దాస్యంకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కా ర్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మార్నేని రవీందర్రావు, టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రియాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, దాస్యం విజయభాస్కర్, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎడవె ల్లి విజయ, గొలనుకొండ ఉపేంద్ర, అర్బన్ యూత్ అధ్యక్షు డు బోడ డిన్న, మరుపల్లి రవి, మాలకుమ్మరి పరుశరాం, రా చర్ల రాము, అప్పరాజు సాంబమూర్తి, జాని దర్శన్‌సింగ్, గైనే ని రాజన్, లింగంపల్లి కిషన్‌రావు, తిప్పారపు లక్ష్మణ్‌మాదిగ, రాజ్‌కిశోర్, యాకూబ్‌రెడ్డి, నయీం, సదాంత్ పాల్గొన్నారు.