వరంగల్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. రేపు ఆయన తన సతీమణితో కలిసి ఆలయ...
వరంగల్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. రేపు ఆయన తన సతీమణితో కలిసి ఆలయంకు రానున్నారు. ఆలయంలో దంపతులిద్దరు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం దంపతులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రేపు ఆలయానికి రానున్న దృష్ట్యా భద్రకాళి దేవాలయ ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.