-రామగుండం మాజీ కమిషనర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. -ముడుపులతో పాటు బంధువుల పేరిట 200 చదరపు గజాల స్థలం స్వాహా.. -దీని మార్కెట్ విల...
-రామగుండం మాజీ కమిషనర్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..
-ముడుపులతో పాటు బంధువుల పేరిట 200 చదరపు గజాల స్థలం స్వాహా..
-దీని మార్కెట్ విలువ అక్షరాలా రూ. 50 లక్షలు?
-ఆధారాలతో సహా విచారణాధికారి నివేదిక
-రంగంలోకి విజిలెన్స్?
గోదావరిఖని నడిబొడ్డున వివాదాస్పద స్థలంలో ప్రహరీ నిర్మాణానికి అనుమతిచ్చి, రూ. 30 లక్షల ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రామగుండం మాజీ కమిషనర్ ఎస్.రవీంద్ర లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పక్కా వ్యూహం ప్రకారం, రియల్టర్లతో చేతులు కలిపిన ఈయనగారు, ముడుపులతో పాటు అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ. 50 లక్షల విలువ చేసే 200 చదరపు గజాల స్థలాన్ని కొట్టేసినట్లు తాజాగా బయటపడింది. తనకు సమీప బంధువైన ఓ మహిళ పేరిట దీనిని రిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో తేలడం, రవీంద్ర అక్రమాలకు అద్దంపడుతోంది.
రామగుండం పురపాలకసంఘం పరిధిలోని గోదావరిఖని నడిబొడ్డున ఉన్న 39 గుంటల వివాదాస్పద స్థలంలో ప్రహరీ నిర్మాణానికి అనుమతిచ్చేందుకు గతంలో పనిచేసిన కమిషనర్ ఎస్. రవీంద్ర తొక్కిన అడ్డదారులను నమస్తే తెలంగాణ జిల్లా సంచికలో శుక్రవారం ఈ ఆఫీసరు.. మహా కమీషనరు! పేరిట బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ కథనం ఖనిలో సంచల నం సృష్టించింది. ప్రధానంగా సదరు భూమికి బ హిరంగ మార్కెట్‌లో ఉన్న విలువ, దాన్ని కాజేసేందుకు రియల్టర్లు పక్కా వ్యూహంతో ముందుకు పోతున్న తీరు,
దీనికి సహకరిస్తున్న కొంత మంది నాయకులు, కమిషనర్ అనుమతి ఇచ్చిన తీరును నమస్తే కూలంకషంగా వివరించింది. ఈ భూమి లో ప్రహరీ నిర్మాణం కోసం ఇచ్చిన అనుమతి, కమిషనర్ రవీంద్ర అక్రమాలకు పాల్పడిన తీరుపై సుమారు పది రకాల ఫిర్యాదులు పురపాలక సం ఘం ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్లగా, కలెక్టర్ విచారణ కు ఆదేశించడంతో పెద్దపల్లి ఆర్డీఓ నారాయణరెడ్డి విచారణ చేపట్టి అనుమతి ఇచ్చేందుకు కమిషనర్ ఏకంగా రూ. 30 లక్షల దాకా ముడుపులు తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాగా ఈ వ్యవహారంలో లోతైన విచారణ చేస్తున్న కొద్దీ కమిషనర్‌కు సంబంధించి కొత్త అక్రమాలు బయటకొస్తున్నాయి.
రూ. 50 లక్షల విలువైన స్థలం రిజిస్ట్రేషన్
డబ్బు రూపంలో ముడుపులే కాదు.. ఏకంగా గోదావరిఖని పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాం తంలో 200 చదరపు గజాల స్థలాన్ని సదరు కమిషనర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు విచారణలో బహిర్గతమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా సద రు అధికారి వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తే లింది. తన పేరుతో రియల్టర్లు రిజిస్ట్రేషన్ చేస్తే.. విషయం బయటకు పొక్కుతుందని భావించి, తనకు అత్యంత సన్నిహిత బంధువైన ఓ మహిళ పేరుతో ఈ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కమిషనర్‌పై ఫిర్యాదు చేసినవారు సంబంధిత ఆధారాలను విచారణాధికారికి సమర్పించగా, ఆ మేరకు విచారణ చేసి, నిజమేనని తే ల్చినట్లు సమాచారం. ఓ స్థలంలో ప్రహరీ నిర్మాణానికి అనుమతిచ్చేందుకు సదరు కమిషనర్ నగదు, స్థలం ఖరీదు కలిపి సుమారు 80 లక్షల దాకా పుచ్చుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఆధారాలతో నివేదిక ?
పెద్దపల్లి ఆర్డీఓ నారాయణరెడ్డి, కమిషనర్‌పై వచ్చిన ఫిర్యాదులపై లోతైన పరిశీలన చేస్తున్నారు. సదరు అధికారిపై వచ్చిన ఒక్కో ఆరోపణ నిజం కావడంతో విచారణపై పూర్తిస్థాయి శ్రద్ధపెట్టారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను కలెక్టర్‌కు, జేసీకి ఇచ్చిన ఆర్డీఓ, మరింత లోతుగా సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్థలం రిజిస్ట్రేషన్ వ్యవహారానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా బటయటకు తీశారనీ, ఆ మేరకు ఆధారాలతో మరో నివేదిక కూడా సమర్పించారని సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపకుం డా అడ్డుకునేందుకు రియల్టర్లు వివిధ వర్గాలతో ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది.
రంగంలోకి విజిలెన్స్
నమస్తే తెలంగాణ కథనంపై విజిలెన్స్ ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు.. ఎస్.రవీంద్ర పనిచేసిన కాలంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలపైనా ఆరా తీయడమే కాక, సంబంధిత ఫైళ్లను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాకుండా సదరు కమిషనర్ పనిచేసిన కాలంలో నిర్వహించిన టెండర్లు, ఇచ్చి న అనుమతులు, సంక్షేమ పథకాల పేరిట వెచ్చించిన నిధులు తదితర అంశాలపైనా నిశిత పరిశీలన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణ జరిపితే అనేక అక్రమా లు బహిర్గతమవుతాయన్న అభిప్రాయాలు వ్య క్తమవుతున్నాయి.