హైదరాబాద్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యకు మంగళవారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే హైదర్ గూడ అపోలో ఆస్పత్రికి తర...

హైదరాబాద్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్యకు మంగళవారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. ఆయనను వెంటనే హైదర్ గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయినట్టు వైద్యులు గుర్తించారు. రాజయ్యను 24 గంటల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచనున్నట్టు సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల రాజయ్యను పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. రాజయ్య స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు.