సరిహద్దు అటవీ గ్రామాల్లో గుడుంబా తయారీకి కా వాల్సిన నల్లబెల్లం యథేచ్ఛగా విక్రయిస్తూ ఓవ్యాపారి డాన్‌లా వ్యవహరిస్తున్నాడు. చోటా మోటా గుడుం...
సరిహద్దు అటవీ గ్రామాల్లో గుడుంబా తయారీకి కా వాల్సిన నల్లబెల్లం యథేచ్ఛగా విక్రయిస్తూ ఓవ్యాపారి డాన్‌లా వ్యవహరిస్తున్నాడు. చోటా మోటా గుడుంబా విక్రయదారులను తన ఆధీనంలోనే ఉంచుకుని పెద్ద ఎత్తున నల్లబెల్లం దందా కొనసాగిస్తున్నాడు. లారీల కొ ద్దీ సరుకును గ్రామాల్లో దిగుమతి చేస్తూ బలవంతంగా అంటగడుతున్నాడు. తీసుకోని వ్యాపారులను బెదిరి స్తూ, అవసరమైతే కేసులు నమోదు చేయిస్తానని హెచ్చ రిస్తున్నాడు. కరీంనగర్ జిల్లా సరిహద్దు గ్రామానికి చెందిన సదరు బెల్లండాన్ భూపాలపల్లి మండలంలోనూ పాగా వేసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు. ఇదంతా తెలిసినప్పటికీ ఎక్సైజ్, పోలీసు అధికారులు ప ట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
భూపాలపల్లి మండలానికి సమీపంలో గల సరిహద్దు అటవీ గ్రామాల్లో బెల్లండాన్ హవా నడుస్తోంది. గ్రామాల్లో నల్లబెల్లం విక్రయదారులు, గుడుంబా తయారీదారులంతా ఆయన గుప్పిట్లోనే ఉంటారు. లారీల కొద్దీ బెల్లం, పటిక లోడ్లను గ్రామాల్లో దిగుమతి చేస్తుంటాడు. గ్రామాల్లో బెల్లం, పటిక కొనుగోలు చేయని వ్యాపారులను తన పలు కుబడితో వేధింపులకు గురిచేయించడం, అవసరమైతే కేసులు నమోదు చేయిస్తూ తన వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తుంటాడని చెప్పుకుంటున్నారు.
పొరుగు జిల్లా సరిహద్దు గ్రామానికి చెందిన సదరు బెల్లం డాన్ భూపాల పల్లి మండలంలోనూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటు న్నాడు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా చర్యలు మాత్రం కరువవుతున్నాయి. సరిహద్దును ఆనుకుని ఉన్న కరీంనగర్ జిల్లా కాటారానికి చెందిన ఒక బెల్లం వ్యాపారి సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో గుడుంబా తయారీకి ముడిస రుకును రవాణా చేస్తుంటాడు. కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్, మల్హర్ తదితర మండలాల్లోని చోటామో టా బెల్లం వ్యాపారులందరికి నిత్యం లారీల కొలది బెల్లం, పటికను రవాణా చేస్తూ సంబంధిత అధికారు లకు నెలవారీ ముడుపులు అందజేస్తుంటాడనేది బహిరంగ రహస్యం.
భూపాలపల్లి ఏరియాకు విస్తరణ..
కరీంనగర్ జిల్లా మంథని డివిజన్లోని మెజార్టీ అటవీ గ్రామాల్లో పాగా వేసిన ఈ బెల్లండాన్ తన వ్యాపారాన్ని సరిహద్దు దాటి భూపాలపల్లి ఏరియాకు విస్తరించాడు. అప్పటికే భూపాలపల్లి ఏరియాలో బెల్లం, పటిక విక్రయా లు జరుపుతున్న వ్యాపారులకు చెక్ పెట్టాడు. వారిని తన వద్దే బెల్లం, పటిక కొనుగోలు చేయాలని వేధించడంతో వారి పంచాయతీ ఎక్సైజ్ అధికారుల వరకు వెళ్లినట్లు సమాచారం.
భూపాలపల్లి నగరపంచాయతీ పరిధిలోని ఒక బెల్లం వ్యాపారి మండలంలోని అటవీగ్రామమైన గొల్లబుద్ధారం లో గల ఒక చోటామోటా వ్యాపారికి నల్లబెల్లం రవాణా చేస్తుంటాడు. ఈక్రమంలో గొల్లబుద్ధారం వ్యాపారి భూపా లపల్లి వ్యాపారికి రూ. 4 లక్షలు బకాయి పడ్డాడు.
ఈ విషయమై బెల్లం డాన్ రంగంలోకి దిగి రూ. 4 లక్షలు ఇవ్వొద్దని చెప్పి సదరు వ్యాపారికి అండగా నిలబడి గొల్లబుద్ధారానికి తానే బెల్లం, పటిక రవాణా చేస్తున్నట్లు తెలిసింది.బకాయిల గురించి ఇరువర్గాల మధ్య పంచాయతీ జరిగినా ఫలితం లేదని భూపాలపల్లి వ్యాపారి సదరు బెల్లండాన్ గురించి ఎక్సైజ్ అధికారుల ముందు వాపోయినట్లు సమాచారం.
రోజుకు 4 వేల లీటర్లు.. భూపాలపల్లి మండలంలో రోజుకు 4 వేల లీటర్ల గుడం బా తయారవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
వేశాలపల్లి, పెద్దకుంటపల్లి, జంగేడు, గొర్లవీడు తండా, కొంపెల్లి తండా, గొల్లబుద్ధ్దారం తదితర గ్రామాల్లో గుడంబా తయారీ విచ్చలవిడిగా జరుగుతోంది. మండలంలో ముగ్గురు బెల్లం వ్యాపారులుండగా, ప్రస్తుతం కాటారానికి చెందిన బెల్లండాన్ పెద్దమొత్తంలో బెల్లం, పటిక రావాణా చేస్తున్న ట్లు తెలుస్తోంది. బెల్లం రవాణా చేసే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ ప్రకటించి పలువురిపై కేసులు నమోదు చేయగా కాటారం బెల్లండాన్ పేరులేకపోవడంపై వ్యాపారులు విస్మయం చెందుతున్నారు.