పెద్దపల్లి, : సంక్రాంతి పండుగకు పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. ప్ర స్తుతం ఒక్కో కోడి ధర రూ. 10వేల దాకా పలుకుతోంది. గతంలో గెలిచిన కోళ్లక...
పెద్దపల్లి, : సంక్రాంతి పండుగకు పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. ప్ర స్తుతం ఒక్కో కోడి ధర రూ. 10వేల దాకా పలుకుతోంది. గతంలో గెలిచిన కోళ్లకు మరింత డి మాండ్ ఉంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోళ్ల పందాలు నిర్వహణకు కోళ్ల కొనుగోళ్లలో రోజుకు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ఇక సం క్రాంతి రోజు నిర్వహించే పందాలపై పోలీసులు దృష్టి సారించకుంటే పందెం రాయుళ్లు మరింత రెచ్చిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పందెం కోళ్ల పెంపకంపై దృష్టి
సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని చా లా గ్రామాల్లో కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతుండడంతో చా లా మంది పందెం రాయుళ్లు కోళ్ల పందాల నిర్వహాణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇం దుకోసం గతంలో నిర్వహించిన పందెంలో రా ణించిన కోళ్ల అన్వేషణలో పడ్డారు. కాగా పందెం కోళ్ల కొనుగోళ్లు నానాటికీ పెరుగుతుండడంతో జిల్లాలో ఇప్పుడు చాలా మంది పందెం కోళ్ల పెం పకం దృష్టి సారించారు. తక్కువ పెట్టుబడితో ఎ క్కువ లాభాలు ఉండడంతో గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పందెం కోళ్ల పెంపకంపై ఆ సక్తి చూపిస్తున్నారు. జిల్లాలో ఒక్క పందెం కోడి ధర సుమారు రూ. 10వేల పైగా పలకుతుండడం, గెలిచిన కోళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో చా లా మంది పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. పం దెం కోళ్ల ధర తక్కువలో తక్కువగా రూ. 2 వేల నుంచి ప్రారంభమై రూ. 10 వేల దాకా పలుకు తోంది. ఈ కోళ్ల కోసం ప్రత్యేక దాణాతో పాటు పెంపకంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అం దుకోసమే ఎక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోందని పెంపకందారులు అంటున్నారు.
చాలా గ్రామాల్లో పందాలు
సంకాంత్రి పండుగ వచ్చిందంటే చాలు జి ల్లాలోని చాలా గ్రామాల్లో కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. పెద్దపల్లి, మంథని, సిరిసిల్ల, జగిత్యాల డివిజన్లతో పాటు హుజూరాబాద్, హుస్నాబాద్, ధర్మపురి తదితర ప్రాంతాల్లోని గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. ఇందు లో లక్షల రూపాయాలు చేతులు మారుతుంటా యి. కోళ్ల పందాల మోజులో పడి కొందరు ఇళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పోలీసులు దాడులు నిర్వహిన్నా పందాలను పూర్తి స్థాయిలో అడ్డుకోలేక పోతున్నారు. కొందరు గ్రామస్తులు సంప్రదాయం పేరుతో కోళ్ల పందాలు నిర్వహిస్తూ పోలీసుల దాడుల నుంచి తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా పందేం రాయుళ్లపై పోలీసులు కఠినం గా వ్యవరించాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాకు చేరుతున్న మహారాష్ట్ర వాసులు..
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాది పొడవునా కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. జిల్లాలో పందేం కోళ్ల పెంపకందారులు సాధారణంగా డిసెంబర్ నుంచి పందెం కోళ్లను పెంచు తుంటారు. డిసెంబర్లో పుట్టిన కోడి పిల్లలను ఏ డాది తర్వాత వచ్చే సంకాంత్రి వరకు పందెం నిర్వహణకు సిద్ధం చేస్తారు. ఏడాది బాగా రాణిస్తుందని పందెం రాయుళ్ల నమ్మకం. రాష్ట్రంలో పెరిగిన కోళ్లకు మహారాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం స్థానికంగా ఏడాది వయస్సున్న పందెం కోళ్లు లభ్యమవుతుండడంతో మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు జిల్లాలో పందెం కోళ్ల వేటలో పడ్డారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న పందెం రాయుళ్లు, పెద్దమొత్తంలో రెట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.