హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి విశేష స్పందన వస్తుంది. మ...
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి విశేష స్పందన వస్తుంది. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని అన్వయించుకునేందుకు అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల నుంచి తెలంగాణ ఎన్నారైలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నట్టు నీటిపారుదల శాఖ వెల్లడించింది. ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరు మీద చెరువుల పునరుద్ధరణ చేపట్టడంపై ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .
చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం గ్రామీణ వికాసానికి విశేషంగా దోహదపడుతుందని ఎన్నారైలు అభిప్రాయపడుతున్నారు. మిషన్‌కాకతీయ కార్యక్రమానికి ఎన్నారైలే కాకుండా రాష్ట్రంలోని మాజీ సైనికులు,పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, ఉద్యమ సంఘాలు, న్యాయవాదులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాకు ఒక చెరువు చొప్పున 10 చెరువులను దత్తత తీసుకునేందుకు తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. మిషన్ కాకతీయ కార్యక్రమానికి గాను తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్, ఉద్యోగుల సంఘం ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో ఓక రోజు శ్రమదానం చేయనున్నట్టు టీఎన్జీవోలు వెల్లడించారు.