-సాయంత్రం వేళ ఖమ్మంలో పర్యటన -పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లోకి భారీ చేరికలు -సీఎం కేసీఆర్ ఆశయసాధనకు కృషి...
-సాయంత్రం వేళ ఖమ్మంలో పర్యటన
-పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లోకి భారీ చేరికలు
-సీఎం కేసీఆర్ ఆశయసాధనకు కృషి చేయాలని పిలుపు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సాయంత్రం ఖమ్మంలో బిజీబిజీగా గడిపారు. నగరంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సమక్షంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..రానున్న కాలంలో జిల్లాను గులాబీమయం చేయాలని, బంగారు తెలంగాణ కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జిల్లాకు వచ్చే నాటికి అర్హులైన ప్రతిఒక్కరికీ ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందేలా నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని సూచించారు.
నమస్తే తెలంగాణ, ఖమ్మం: ఖమ్మం నగరానికి వచ్చిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిజీబిజీగా గడిపారు. శనివారం సాయంత్రం ఆయన నగరంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత నగరంలోని గాంధీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ. 29.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన వివరాలు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాల,
బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నాయా..? తాగునీటి సౌకర్యం ఉన్నదా అని జిల్లా విద్యాశాఖాధికారి కొండా రవీంద్రనాథ్‌రెడ్డిని, ఎస్ఎస్ఏ డీఈ రోషయ్యను, ఈఈ రవికుమార్‌ని ప్రశ్నించారు. అన్ని వసతులు ఉన్నాయి కానీ వాడకంలోకి తీసుకురావటం లేదని సమాధానం చెప్పటంతో, ఆ పని ఎవరు చేయాలని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి పాఠశాలకు టాయ్‌లెట్స్ సౌకర్యం ఉండాలని, వాటి వాస్తవ పరిస్థితి తెలిసేలా ఫొటోను అందించాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు త్వరలో ప్రత్యేక బృందాలు జిల్లాలో పర్యటిస్తాయి, ఈలోపు ప్రతి పాఠశాలకు మరుగుదొడ్డి ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
-మార్కెట్లో ఫైర్ స్టేషన్ ప్రారంభం..!
శనివారం మంత్రి తుమ్మల, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి మార్కెట్లో ఏర్పాటు చేసిన ఫైర్ష్టేషన్ను ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అగ్నిమాపక కేంద్రాన్ని మంత్రి ప్రారంభించటంతో వ్యాపారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీఎంఎస్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం ఆర్డీవో వై.వినయ్‌కృష్ణారెడ్డి, నగరపాలకసంస్థ కమిషనర్ బీ.వేణుమనోహర్‌రావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి, ఖమ్మం అర్భన్ తహసీల్దార్ వెంకారెడ్డి, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ పీ.సుధాకర్, జిల్లా అసిస్టెంట్ మార్కెట్ డైరెక్టర్ శీలంకోటి వినోద్‌కుమార్, మార్కెట్ గ్రేడ్-2 అధికారి ఖాదర్‌బాబు, కిరణ్‌కుమార్, నరేష్, చిన్నాంజనేయులు, ప్రసాద్, వెంకటేశ్వర్లు, వజీర్ తో పాటు పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మెంతుల శ్రీశైలం ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
-పండ్ల వ్యాపారులకు శాశ్వత మార్కెట్‌యార్డు...
ఖమ్మం నగరంలోని పండ్ల వ్యాపారులకు శాశ్వత మార్కెట్‌యార్డును నిర్మించి ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. గ్రెయిన్ మార్కెట్‌యార్డులో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి షాదీఖానా పక్కన ఖమ్మం ఫ్రూట్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. రోడ్లవెంబడి, మురికి కాలువల పక్కన పండ్లు విక్రయించటం మూలంగా వ్యాపారులతోపాటు వినియోగదారులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. పండ్ల వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తానని గతంలోనే హామీ ఇచ్చానని, కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకపోవటంతో నెరవేర్చలేక పోయానని,
ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్నివర్గాల ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. నగరంలో ఎక్కడ వ్యాపారం నిర్వహించాలి, ఎక్కడ బండ్లు పెడితే జీవనం మెరుగవుతుందో పండ్ల వ్యాపారులే నిర్ణంచుకోవాలని సూచించారు. మీరు నిర్ణయించండి..! నేను ఆచరించి చూపిస్తానని మంత్రి అనటంతో సభలో హర్షద్వానాలు వ్యక్తమయ్యాయి. రానున్న రోజుల్లో ఖమ్మం నగరం క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలన్నారు. మటన్, ఫిష్, కబేళా మార్కెట్లు ఉన్నట్లుగానే పండ్లకు ప్రత్యేక యార్డును చూపిస్తామని, వినియోగదారులకు నమ్మకం కలిగేలా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని సూచించారు.
-టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు..!
నగరంలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ముగియగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేరుగా తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఖమ్మంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మం నగరంలో టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్ బొమ్మా నాగేశ్వరరావు, బొమ్మా దుర్గ ఆధ్వర్యంలో 40 మంది, టీఆర్ఎస్ నాయకుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో రమణగుట్ట (26, 27డివిజన్) ప్రాంతానికి చెందిన 70 మంది, ఖమ్మం శుక్రవారపేట పొదిల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీరితోపాటు కూనవరం మండలం వైసీపీ నుంచి షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో 10 మంది, గార్ల మండలం పుల్లూరు గ్రామ ఎంపీటీసీ ముత్తయ్య, అదే మండలం సీతంపేట గ్రామ సర్పంచ్ బాణోత్ లావణ్య పార్టీలో చేరారు.