-నాలుగు రోజుల క్రితం స్వైన్‌ఫ్లూ లక్షణాలతో -కరీంనగర్ పెద్దాసుపత్రికి కుటుంబం -చిన్నారికి వ్యాధి నిర్ధారణ -హైదరాబాద్‌కు వైద్యుల రిఫ...
-కరీంనగర్ పెద్దాసుపత్రికి కుటుంబం
-చిన్నారికి వ్యాధి నిర్ధారణ
-హైదరాబాద్‌కు వైద్యుల రిఫర్
-తరలించేందుకు అంబులెన్స్ కరువు
మందమర్రి/ కరీంనగర్: స్వైన్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని, ఆయా జిల్లాల్లో ని పెద్దాసుపత్రులు, ఏరియా ఆసుపత్రులకు మందులు పంపించినందున అత్యవసర చికిత్స అందించాలని సర్కారు చెప్పినా వైద్యసిబ్బంది తీరు మారడం లేదు. స్వైన్‌ఫ్లూ సోకిన ఓ చిన్నారికి స్థానికం గా చికిత్స అందించే అవకాశమున్నా ఇతర ప్రాంతాలకు రిఫర్ చేసి, చేతు లు దులుపుకోవడంతో ఆ కుటుంబం, కరీంనగర్ జిల్లాలోనూ నరకయాతన అనుభవించిం ది. వివరాలివి.. మందమర్రి పట్టణం విద్యానగర్‌కు చెందిన వానరాసి నరేశ్, ఆయన భా ర్య రాజేశ్వరి, కూతుళ్లు లక్ష్మి, లలిత, కొడుకు సింహాద్రితోపాటు ఆయన తమ్ముడు మహేశ్ కూతు రు చిట్టి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో శనివారం మం చిర్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చా రు.
ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసినా అక్కడి సిబ్బంది పట్టించుకోకుండా రెఫర్ చేయడం తో, నరకయాతన అనుభవించారు. తర్వాత ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలిం చారు. అక్కడ ఆసుపత్రిలో ప్రత్యేకంగా కేటాయించిన స్వైన్‌ప్లూ వార్డులో రాజేశ్వరి, లలిత, లక్ష్మి, చిట్టిని చేర్చుకుని వైద్యులు, చికిత్స అందిస్తున్నారు. వారి రక్తనమునాలను హైదరాబాద్‌కు తరలించగా ఆకుటుంబంలోని లలిత (6)కు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అలీం, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆజ్మీరా భోజానాయక్, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కేకే లక్ష్మణ్ ధ్రువీకరించారు.
మధ్యాహ్నమే లలితను హైదరాబాద్ తరలించేందుకు ఆసుపత్రి వైద్యులు ఏర్పాట్లు చేశా రు. కాగా, ఆసుపత్రిలో ఉన్న ఒకే ఒక్క అంబులెన్స్ ఓ పేషంట్‌ను తీసుకొని వరంగల్‌కు వె ళ్లింది. వేరే ఏ ఆంబులెన్స్ ముందుకు రాలేదు. దీంతో వరంగల్ నుంచి ఆంబులెన్స్ వచ్చే దా కా ఆ కుటుంబం భయాందోళన నడుమ గడిపింది. చివరకు సాయంత్రం 6 గంటలకు అం బులెన్స్ రాగా, హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లింది. కాగా లలిత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ అలీం తెలిపారు. ఆసుపత్రిలో కూడా మందులున్నా, ముందు జాగ్రత్తగా హైదరాబాద్ తరలించామని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఒకే అంబులెన్స్ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో రోగుల పరిస్థితి ఏంటని అక్కడున్న రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆందోళన వద్దు: విప్ నల్లాల ఓదెలు
విషయ తెలిసిన ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలు మంగళవారం సాయంత్రం హుటాహుటిన మందమర్రి వి ద్యానగర్ను సందర్శించారు. సుమారు 500 మాస్క్‌లు పంపిణీ చేశారు. ఇంటింటా తిరిగి, ఎవరైనా బాధితులున్నారా? అని ఆరాతీశా రు. కలెక్టర్‌తో ఫోన్లో మా ట్లాడి, ఈ ప్రాంతానికి డాక్టర్ల బృందాన్ని పంపాలని కోరారు. భయభ్రాంతులకు గురికావద్దని స్థానికులకు విజ్ణప్తి చేశారు. ఆయన వెంట మం డల తహసీల్దార్ కిషన్, మున్సిపాలిటీ కమిసనర్ లిం బాద్రి, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.