ఆదిలాబాద్ రూరల్, : జిల్లాలోని పలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిర్ణీత ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తూ వ...
ఆదిలాబాద్ రూరల్, : జిల్లాలోని పలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిర్ణీత ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తూ విద్యార్థులను నిలువున దోపిడీ చేస్తున్నాయి. ఒకరిని చూసి మ రొకరు అన్నట్లు పోటీ పడి మరీ అధిక ఫీజులకు తెగబడుతున్న డిగ్రీ కళాశాలల బాగోతం ఏటా వి ద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా కళాశాలలు నిర్ణయించిన ఫీజులే చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే వార్షిక పరీక్షలకు ఇప్పటికే అనేక కళాశాలలు ఫీజుల పేరిట దోచుకోవల్సినంత దోచుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రథమ, ద్వితీ య సంవత్సరాల విద్యార్థులకు ఒక విధంగా, తృతీయ సంవత్సర విద్యార్థులకు మరొక విధంగా ప్రభుత్వం ఫీజులు నిర్ణయించినా మూడు సంవత్సరాల విద్యార్థులకు ఒకే రీతిలో ఫీజులు వసూ లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఏ విద్యార్థిని కదిలించినా ఇపుడు ఈ విషయాన్నే ప్ర ధానంగా చర్చించుకుంటున్నారు. మరో పక్క కళాశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులు చెల్లించలేక వందలాది నిరుపేద విద్యార్థులు సతమతమవుతున్నారు..
ఏటా ఇదే దోపిడీ
జిల్లాలో సుమారు 10 ప్రభుత్వ, 60 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. సుమారు 45 వేల మంది విద్యార్థులు ఈ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ఏడాదిలో కూడా ఎప్పటిలాగే అధిక ఫీజులు వసూలు చేసేందుకు పలు కళాశాలలు దా రులు తెరిచాయి. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలు నిర్వహించేందుకు కాకతీయ విశ్వవిద్యాల యం సన్నాహాలు చేస్తుంటే జిల్లాలో మాత్రం వి ద్యార్థుల నుంచి ఏ విధంగా అధిక ఫీజులు వసూ లు చేయాలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. విశ్వవిద్యాలయం పరీక్షల విభా గం అధికారులు నిర్ణయించిన ప్రకారం బీఏ ప్రథ మ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు 550, తృతీయ సంవత్సరం విద్యార్థులు 850, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వి ద్యార్థులు 650, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులు 950 మాత్రమే చెల్లించాల్సి ఉం టుంది. కానీ జిల్లాలో మాత్రం ఒక్కో కళాశాల ఒక్కో రీతిన లెక్కా పత్రం లేకుండా ఫీజులు వసూ లు చేస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
చదివే సంవత్సరాలతో సంబంధం లేకుండా 1,100 నుంచి 1,500 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థులకు మాత్రం పరీక్షల విభాగం నిర్ణయించిన ఫీజుల మేరకే రషీదులు ఇస్తున్నారు. అనేక కళాశాలలు ఇప్పటికే అధిక ఫీజులు వసూలు చేసి ఏమీ ఎరగనట్లు ఉండగా మరి కొన్ని కళాశాలల్లో ఇంకా ఈ అధిక ఫీజుల దోపిడీ నిరాటంకంగా జరుగుతోంది. అయి నా కాకతీయ యునివర్సిటీ అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే తప్పా స్పందించే అవకాశాలు లేవని తప్పించుకుంటున్నారు. ఈ విషయాలపై విద్యార్థులు ఫిర్యాదు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆయా కళాశాలల యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసేంత దైర్యం తమకు లేదని వారు అంటున్నారు. జిల్లాలోని 45 వేల మంది విద్యార్థులు డిగ్రీలో ఉండగా ఒక్కొక్కరి నుంచి రూ. 100 అధికంగా వసూలు చేసిన ఎంత దోపిడీ జరుగుతుందో అధికారులకు అర్ధమైనా మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నారు.
ఇదీ మరో రకం దోపిడీ
కొన్ని కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కా లర్ షిప్‌లు విడుదల కాలేదు. దీంతో వాటిని వి ద్యార్థులే భరించాలని కళశాలల యాజమాన్యాలు ఆంక్షలు పెడుతున్నాయి. కళాశాల ఫీజులు తీసుకుంటేనే పరీక్షల ఫీజులు పంపుతామని బెదిరింపులకు దిగుతున్నారు. రెండు రకాలుగా విద్యార్థులపై ఒత్తిడిపెంచి నిరుటికంటే ఈ సారి కొత్త ఎత్తుగడలతో దోపిడీ సాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా యి. ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీ, స్పోర్ట్స్ ఫీ, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్‌ను చెల్లించాల్సి ఉం టుంది. అయితే ఇందులో అప్లియేషన్ ఫీ, స్టూ డెంట్ వెల్ఫేర్ ఫండ్‌ను ఆయా కళాశాలల యాజమాన్యాలే విశ్వవిద్యాలయానికి చెల్లించాల్సి ఉం టుంది. కానీ అన్ని రకాల ఫీజులు తమనెత్తికే రు ద్దుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. 95 శాతం డిగ్రీ కళాశాలల్లో తరగతి గదులు తప్ప క్రీడా స్థలాలు మచ్చుకైనా కనిపించదు. అయినా విద్యార్థుల నుంచి మాత్రం దీనికి సంబంధించిన ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. ఇలా విద్యార్థులను ఏడిపించి వసూలు చేస్తున్న స్పోర్ట్స్ ఫీజు లు కనీసం విశ్వవిద్యార్థులకు చెల్లిస్తున్నారా అంటే అదీ లేదు.
ఏటా 20 శాతం కళాశాలలు కూడా ఈ ఫీజులు చెల్లించిన పాపాణ పోవడం లేదు. ప్రైవేట్ కళాశాలలను స్ఫూర్తిగా తీసుకున్నరో ఏమోగాని కొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కూడా విద్యార్థులను ఫీజుల పేరిట ఇబ్బందులు పెడుతున్నారనే విమర్శలున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ప్రభు త్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా విద్యార్థుల ము క్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు. కళాశాలలు విధించే ఫీజులు చెల్లించలేక అనేక మంది నిరుపేద విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నా రు. విశ్వ విద్యాలయం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్న పరీక్షల విభాగం అధికారులు ఫిర్యాదు వస్తే తప్పా స్పందించని పరిస్థితి కనిపించడం లే దు. తాము చదివే కళాశాలలపై విద్యార్థులు ఫిర్యా దు చేసే పరిస్థితి ఉండదు. విద్యార్థుల బలహీనతను ఆసరా చేసుకుంటున్న కళాశాలల యా జమాన్యాలు ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నా యో విశ్వవిద్యాలయం అధికారులకు తెలియంది మాత్రం కాదు.
పరీక్ష ఫీజుల పేరిట
పరీక్ష ఫీజు భారం ప్రథమ సంవత్సర విద్యార్థుల నూ వదలడంలేదు. నిబంధనల ప్రకారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 300, ద్వితీయ సంవత్సరం సైన్స్, గణితం విద్యార్థులకు 400, మిగ తా వారికి 300వసూలు చేయాల్సి ఉంది. కాని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి 600 నుంచి మొదలు 2500వరకు వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు, విద్యార్థి సం ఘాలు ఆరోపిస్తున్నాయి. అంటే సరాసరి ఒక్కో విద్యార్థి మీద రూ.వెయ్యి అదనపు భారం పడుతుందనుకుంటే జిల్లావ్యాప్తంగా ఉన్న 30వేల మంది విద్యార్థుల నుంచి 3 కోట్లపైగానే అక్రమంగా వసూలు చేస్తున్నారు. అక్రమ వసూలుపై తల్లిదండ్రులు కళాశాలల యాజమాన్యాలను అడిగితే స్లిప్ టెస్ట్‌లకు అయిన ఖర్చులని సమాధాన మిస్తున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.