హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (ఎస్సార్టీఆర్ఐ)బ్యూటీషియన్, కా...
హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ (ఎస్సార్టీఆర్ఐ)బ్యూటీషియన్, కాస్మటాలజీపై రెండు నెలల ఉచిత శిక్షణ ఇస్తున్నదని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్ కిశోర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఎస్సార్టీఆర్ఐ పనిచేస్తున్నది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన యువతీ యువకులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
హాస్టల్, భోజన వసతికి మాత్రం నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు ధరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉందని, 19వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు పాస్‌పోర్టు సైజు ఫొటోతోపాటు సర్టిఫికెట్లతో భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్పూర్లో ఉన్న ఇన్స్టిట్యూట్లో సంప్రదించాలని తెలిపారు.