నిజామాబాద్ : తాడ్వాయి మండలం ఎర్రపాడు వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు విరిగి పోయాయి. విషయాన్ని...
నిజామాబాద్ : తాడ్వాయి మండలం ఎర్రపాడు వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు విరిగి పోయాయి. విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తతో బస్సును ఆపివేశాడు. దీంతో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాకపోవడంతో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు వేరొక బస్సులో తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.