హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరం నుంచి మారనున్న రాష్ట్ర పాఠ్యాంశాలలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు నిజాం నవాబుల అంశ...
హైదరాబాద్: వచ్చే విద్యాసంవత్సరం నుంచి మారనున్న రాష్ట్ర పాఠ్యాంశాలలో తెలంగాణ ఉద్యమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు నిజాం నవాబుల అంశం చేర్చే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర పరిధిలో నిజాం నవాబులు చేసిన మంచి పనులపై పాఠ్యాంశాల్లో చేర్చక తప్పదని వారు అంటున్నారు. హుస్సేన్‌సాగర్ నిర్మాణం, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ సహా పలు అద్భుత కట్టడాల నిర్మాణంతోపాటు వారి హయాంలోనే నగరాభివృద్ధి కూడా జరిగిందని గుర్తుచేస్తున్నారు.
8వ తరగతి సాంఘిక శాస్త్రంలో 12వ పాఠ్యాంశంగా చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. నిజాం పాఠాలు ఉన్నాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. అందరి అభిప్రాయాల మేరకే వీరి పాఠాలకు స్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు.