-వైద్య, ఆరోగ్యశాఖలో ఏడాదిగా దోపిడీ -స.హ చట్టంతో వెలుగులోకి.. -ఉన్నతాధికారుల లీలలు -పొంతనలేని సమాధానాలు మంచిర్యాల క్లస్టర్ పరిధి...
-వైద్య, ఆరోగ్యశాఖలో ఏడాదిగా దోపిడీ
-స.హ చట్టంతో వెలుగులోకి..
-ఉన్నతాధికారుల లీలలు
-పొంతనలేని సమాధానాలు
మంచిర్యాల క్లస్టర్ పరిధిలోని హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు హెల్త్ సూపర్వైజ ర్లు (ఎంపీహెచ్ఎస్, ఫిమేల్) పని చేయాల్సి ఉం ది. అయితే, స్థానిక వైద్యుడు వెంకటేశ్వర్లు కాసుల కోసం కక్కుర్తి పడి అదనంగా మరో పోస్టు సృష్టించాడు. అంటే ఇక్కడ ఇద్దరు సిబ్బంది ఉండాల్సి ఉండగా, అదనంగా మరో వ్యక్తి పనిచేస్తూ ఏడాదిగా జీతం కూడా తీసుకుంటున్నాడు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ప్రమేయంతోనే బాగోతం నడుస్తున్నట్లు సమాచారం.
-స.హ. చట్టంతో వెలుగులోకి
హాజీపూర్ పీహెచ్సీలో ఎన్ని హెల్త్ సూపర్వైజర్ (ఎంపీహెచ్ఎస్, ఫిమేల్) పోస్టులు ఉన్నా యో తెలుసుకునేందుకు ఒకరు సమాచార హక్కు చట్టం కింద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రెండే పోస్టులు ఉన్నాయని సమాధానం రావడంతో తిరిగి ట్రెజరీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. రెండే పోస్టులుంటే, ముగ్గురికి జీతాలు ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించాడు. దీంతో స్పందించిన ట్రెజరీ అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి లేఖ రాశారు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో హెల్త్ సూపర్వైజర్ల జీతాలు నిలిపివేశారు. ఇక్కడికి వచ్చిన వైద్యురాలు మెహరున్నీసా కూడా అసలు ఎన్ని పోస్టులు చెప్పాలంటూ డీఎంహెచ్ఓ కార్యాలయానికి లేఖ రాయగా, తమకు తెలియదని, వరంగల్లోని ఆర్డీ కార్యాలయాన్ని సంప్రదించాలని చేతులెత్తేశారు.
-చర్యలపై తాత్సారం ఎందుకో?
ఈ విషయమై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో జిల్లాస్థాయి అధికారులకు కూడా ముడుపులు ముట్టాయని, అందుకే నోరు మెదపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే రెండే పోస్టులు ఉన్నాయని చెప్పిన అధికారులు, తిరిగి క్లస్టర్ ఇన్చార్జి డాక్టర్ భీష్మ, వైద్యురాలు మెహరున్నీసా, ట్రెజరీ అధికారి అడిగితే మాత్రం వరంగల్లోని ఆర్డీ కార్యాలయంలో సంప్రదించాలనడం వెనక అంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-కౌటాల వైద్యాధికారిపై చర్యలేవి?
గతంలో కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 2011, మార్చిలో ఇదాయత్ అలీ అనే వైద్యుడిని నియమించగా, ఎలాంటి అనుమతులు లేకుండా నే విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు 2012 జూలైలో అతడిని విధుల నుంచి తొలగించింది. అయితే, అస లు డ్రామా ఇక్కడే నడిచింది. ఇక్కడ పనిచేస్తున్న డ్రాయింగ్ అధికారి జిల్లా కార్యాలయంలోని ఇద్ద రి సిబ్బందితో కుమ్మక్కై ఇదాయత్ అలీకి చెందిన జీతం ప్రతి నెలా డ్రా చేసుకుంటూ వెళ్లాడు. ఇలా ఒకటి రెండు నెలలు కాదు.. దాదాపు 19 నెలల జీతం తీసుకున్నాడు.
దాదాపు రూ. పది లక్షల మేర గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై నివేదిక పంపిన అధికారులు చర్యల కోసం వేచిచూస్తున్నామని సమాధానం ఇస్తున్నారు. దీంట్లో జిల్లాస్థాయి అధికారులకు కూడా ముడుపులు ముట్టడం వల్లే చర్యలకు వెనుకాడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట జిల్లాకు వచ్చిన ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కూడా ఈ విషయమై ఆరా తీశారు. కొం దరు వ్యక్తుల వల్ల వైద్య ఆరోగ్య శాఖ పరువు బజారున పడుతోందని, ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.