రామగుండం రూరల్, జనవరి 10 (టీ మీడియా): రాజీవ్ రహదారిపై రామగుండం పట్టణం మల్యాలపల్లి గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వల...
రామగుండం రూరల్, జనవరి 10 (టీ మీడియా): రాజీవ్ రహదారిపై రామగుండం పట్టణం మల్యాలపల్లి గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతిచెందారు. ఒంగోలు జిల్లా చేకూర్తికి చెందిన తాపీమేస్త్రి తన్నీరు బాలకోట య్య(35), ఖమ్మం జిల్లా లచ్చగూడెంకు చెందిన తోకకుచ్చు రవీందర్(35) కారు ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యా రు. ఇళ్ల నిర్మాణ పనులకోసం వచ్చిన బాలకోటయ్య రామగుండం పట్టణంలో అయోధ్యనగర్, రవీందర్ ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో స్థిరపడ్డారు. బసంత్‌నగర్‌లో పని ముగించుకుని బైక్‌పై రామగుం డం వస్తుండగా, గోదావరిఖని నుంచి పెద్దపల్లికి వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. రవీందర్ సంఘటనాస్థలంలోనే మృతిచెంద గా, బాలకోటయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
ఈయనను 108లో గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. బాలకోటయ్యకు భార్య రాధ, కూతుళ్లు అఖిల (13), సంధ్య (11), పూజ (6) ఉన్నారు. రవీందర్‌కు భార్య విజయలక్ష్మి, కూతుళ్లు దివ్యజ్యోతి(10), నాగజ్యోతి(7) ఉన్నారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ నాగేశ్వర్రావు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నా రు. వాహనాలను పోలీస్టేషన్‌కు తరలించారు. కారులో ఉన్న ము గ్గురిలోడ్రైవర్కు గాయాలయ్యాయి.
మృతులిద్దరికీ కూతుళ్లే..
పొట్టకూటికోసం వలసొచ్చి ఇళ్ల నిర్మాణం చేపడుతూ జీవనం సాగిస్తున్న బాలకోటయ్య, రవీందర్‌కు కూతుళ్లే ఉన్నారు. బాలకోటయ్యకు ముగ్గురు, రవీందర్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రోడ్డుప్రమాద సంఘటన తెలియగానే గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి వచ్చిన కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరు గా విలపించారు.