file photo -కడుపునిండా తినడానికే సన్నబియ్యం -అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న -ఆశ్రమ బాలికలకు దుప్పట్ల పంపిణీ -విద్య...
| file photo |
-కడుపునిండా తినడానికే సన్నబియ్యం
-అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న
-ఆశ్రమ బాలికలకు దుప్పట్ల పంపిణీ
-విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి
ఆదిలాబాద్ రూరల్ :తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వసతిగృహాల విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయిలో వసతులు కల్పిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు దుప్పట్లను పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని పేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యనందించడానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా చలి విపరీతంగా ఉండడంతో 7500 దుప్పట్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థులు కడుపునిండా అన్నం తినడానికే సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. బాలికలకు కాస్మొటిక్ చార్జీలను 70 నుంచి 125కు, బాలురకు 50 నుంచి 100కు త్వరలో పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి మండలకేంద్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఆంగ్ల మాద్యమంలో విద్యను అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మార్చిలో జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో వచ్చేలా, ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని డీఈఓను ఆదేశించారు.
-ప్రభుత్వ బాలికల పాఠశాల తనిఖీ
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపట్టికను పరిశీలించారు. హాజరుశాతం తక్కువగా ఉం డడంతో ప్రధానోపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్య క్తం చేశారు. హాజర శాతం పెరిగేలా చూడాలన్నా రు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు. వారానికి రెండురోజులు తప్పనిసరిగా కోడిగుడ్లు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ సావిత్రి, ఎంపీడీఓ జితేందర్‌రెడ్డి, ఎంఈఓ జయశీల, ప్రధానోపాధ్యాయులు విజయసుందరి, జ్యోతి వైద్య తదితరులు పాల్గొన్నారు.