- స్పీకర్ మధుసూదనాచారి సమైక్య పాలకుల హయాంలో భూపాలపల్లి నియోజకవర్గం పూర్తిగా వెనుకబాటుకు గురైందని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. శాయంప...
- స్పీకర్ మధుసూదనాచారి
సమైక్య పాలకుల హయాంలో భూపాలపల్లి నియోజకవర్గం పూర్తిగా వెనుకబాటుకు గురైందని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. శాయంపేటలో చేనేత కార్మికులు అధికంగా ఉండటంతో పాటు భీవండి, సూరత్లాంటి ప్రాంతాలకు వేల మంది వలస వెళ్లారని, ఇక్కడ ఒక స్పిన్నింగ్ మిల్లు నిర్మించాలని కోరారు. అదేవిధంగా గణపసముద్రంలోని మోరంచ ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్‌గా మార్చాలని కోరారు. రేగొండ మండలంలోని పాండవుల గుట్టను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. చిట్యాల మండలంలో ఇనుప ఖనిజాలు ఉన్నాయని,
ఇక్కడ గతంలో అక్రమ మైనింగ్ జరిగేదని, వీలైతే మినీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరారు. భూపాలపల్లికి రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి కేంద్రంతో మాట్లాడి రామగుండం-మణుగూర్ రైల్వే లైన్ కానీ, భూపాలపల్లి-జమ్మికుంట రైల్ మార్గం కానీ మంజూరు చేయించాలని కోరారు. భీమగణపురం సమీపంలో ఉన్న 8గ్రామాలకు సాగు, తాగు నీరందించాలని కోరారు. భూపాలపల్లిలో పీజీ కళాశాలకు కొత్త భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.