మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని సాయికుంట చెరువు కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా చెరువులో నీరు నిలువ ఉండే ప్రాంతం వరకు రి...
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని సాయికుంట చెరువు కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా చెరువులో నీరు నిలువ ఉండే ప్రాంతం వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టిని నింపి ప్లాట్లకు అనువుగా చదును చేశారు. పట్టణం మధ్యలో ఈ సా యికుంట చెరువు ఉండడం, చుట్టూ నివాసాలు ఉండడం, భూముల విలువలు అధికంగా ఉం డ డం లాంటి అంశాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారు లు ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా కబ్జా చేసేందుకు వెనుకాడడం లేదు. గతంలోనే ఈ చెరువు స్థలాన్ని కబ్జా చేయడానికి పలువురు భూబకాసురులు ప్ర యత్నించినా అప్పటి రెవెన్యూ అధికారులు వారి ఆగడాలను అడ్డుకున్నారు.
తాజాగా రెండ్రోజుల కిందట గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ట్రాక్టర్లను పెట్టి చెరువు స్థలంలోకి చదును చే యడం ప్రారంభించారు. చెరువుకు పక్కనున్న స ర్వే నంబర్లను చూపిస్తూ చెరువు స్థలంలో తమకు పట్టా భూమి ఉందని వ్యాపారు లు నమ్మబలుకుతున్నారు. గర్మిళ్ల శివారులోని సర్వే నంబర్ 629లో ఎనిమిది ఎకరాల 17 గుంటలు, సర్వే నంబర్ 630లో 30 గుంటల స్థలంలో సాయికుంట చెరువు విస్తరించి ఉంది. దీనికి ఉత్తరం భాగంలో పలువురు భూ వ్యాపారులు ఇతర సర్వే నెంబర్లను చూపిస్తూ తమకు పట్టా భూమి ఉందని చెబుతున్నారు. ఓవర్ బ్రిడ్జికి అవతలవైపున ఉన్న సాయికుంట ప్రదేశంలో గజం భూమి రూ. ఆరు వేలు మొదలుకొని 10 వేల దాకా పలుకుతోంది. భూమికి పెరిగిన విలువను దృష్టిలో పె ట్టుకొని వ్యాపారులు దాదాపు చె రువులోపలి వర కు మట్టితో నింపుతున్నారు. వర్షా కాలంలో సా యికుంట చెరువు నిండితే దూరంగా ఉన్న జా తీయ రహదారి వరకు నీరు నిండిపోతుం ది. అ లాంటి చెరువులోకి మట్టి నింపి ప్లాట్లుగా మా ర్చడం, అక్కడ ఇళ్ల్లు నిర్మించడం వంటివి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
సర్వే రిపోర్టు వచ్చే దాకా పనులు ఆపమని చెప్పాం
- మంచిర్యాల తహసీల్దార్ సురేశ్
సాయికుంట చెరువు స్థలంలో మట్టి పోస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించాను. ఇటీవలే ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ భూమిని కొలిచారు. ఆ రిపోర్టు వచ్చే వరకు ఇక్కడ పనులు చేపట్టవద్దని సంబంధిత భూమి యాజమానులకు చెప్పాం. సర్వే రిపోర్టు ఆధారంగా చెరువు స్థలం ఆక్రమిస్తే స్వాధీనపర్చుకొని తగిన చర్యలు తీసుకుంటాం. చెరువుని ఆనుకునే ప్లాట్లు పెడుతున్నందున రాను న్న రోజుల్లో ఇబ్బందులు వస్తాయని చెప్పాం. ప్రస్తుతానికి పనులు నిలిచిపోయాయి.