రాష్ర్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మానుకోటను జిల్లాగా మార్చేందుకు కృషి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి బంగారు త...

రాష్ర్ట భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు
మానుకోటను జిల్లాగా మార్చేందుకు కృషి
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి
బంగారు తెలంగాణే సీఎం కె.చంద్రశేఖరరావు లక్ష్యమని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మహబూబాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.. మానుకోటను జిల్లాగా మారుస్తానని, ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
మహబూబాబాద్ రూరల్ : బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మానుకోటలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం యశోద గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పీసీసీ కార్యదర్శి వి.రాజ్వర్ధన్రెడ్డితో పాటు కేసముద్రం జెడ్పీటీసీ సభ్యురాలు పద్మవెంకన్నతోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీష్‌రావు మాట్లాడుతూ.. రాజ్వర్ధన్రెడ్డి సౌమ్యుడని, టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపులో క్రియాశీలకపాత్ర పోషించారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మినందువల్లనే నేడు రాజ్వర్ధన్ టీఆర్ఎస్లో చేరారని తెలిపారు. సీఎం కేసీఆర్ బయ్యారంలో స్టీల్ ప్లాంట్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, మానుకోట ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు కృషి చేస్తున్నారని వివరించారు. సమైఖ్య రాష్ట్రంలో ఎస్సారెస్పీ కాల్వలు తీసినా వాటిలోకి నీరు రాలేదని, దేవాదుల కట్టినా నీళ్లు వస్తలేవన్నారు. నీరు అవసరం ఉన్న రిజర్వాయర్లు కట్టాలని సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులపై రిజ ర్వాయర్లు కట్టిస్తామని, ఇందుకోసం శ్యాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. మానుకోట మండలంలోని అనంతాద్రి వెంకన్న మహిమ కలవాడని, ఈ మేరకు అనంతారంలోని మైసమ్మ చెరువు అభివృద్ధికి రూ.4.80 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్ విభజన జరిగిన వెంటనే మానుకోటను జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడి శాశ్వత నీటి పరిష్కారానికి వాటర్‌గ్రిడ్‌లో భాగంగా మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. నాలుగేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. మిషన్‌కాకతీయ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రూ.22వేల కోట్ల 46వేల చెరువుల అభివృద్ధి చేయనున్నామన్నారు. కేంద్ర మంత్రి ఉమాభారతి, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వరంగల్‌లోనే త్వరలో మిషన్‌కాకతీయ పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ సమావేశం అనంతరం జేఏసీ డివిజన్ కన్వీనర్ డాక్టర్ డోలి సత్యనారాయణ హరీష్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, ధాస్యం వినయ్‌భాస్కర్, డీఎస్ రెడ్యానాయక్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపూరి రాజలింగం, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మాలోత్ కవిత, సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్సీ వి.వెంకటరెడ్డి, ఎంపీపీ గోనె ఉమారాణి, టీఆర్ఎస్ నాయకులు భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, నున్న రమణ, ఘనపురం అంజయ్య, మార్నేని వెంకన్న, మద్దసాని సహోదర్‌రెడ్డి, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, భూక్యనెహ్రునాయక్, మంగళంపల్లి కన్నా, డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.