ఆదిలాబాద్ : జిల్లాలోని బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత పంచమి వేడుకలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారంభించార...
ఆదిలాబాద్ : జిల్లాలోని బాసరలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత పంచమి వేడుకలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారంభించారు. సరస్వతి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించారు. చిన్నారుల చేత అక్షరభ్యాసం చేయించేందుకు భక్తులు బారులు తీరారు. గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.