తాంసి: మాండ్వి నుంచి ఆదిలాబాద్ వెళ్లే బస్ నెంబర్ ఏపీ11జడ్5382 సోమవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో చిట్టల నాగాపురం వద్ద అగ్నిప్రమాదం బ్యాటర...
తాంసి: మాండ్వి నుంచి ఆదిలాబాద్ వెళ్లే బస్ నెంబర్ ఏపీ11జడ్5382 సోమవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో చిట్టల నాగాపురం వద్ద అగ్నిప్రమాదం బ్యాటరీలో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ గోపాల్, కండక్టర్ సంజీవ్ కథనం ప్రకారం.. అకస్మాత్తుగా బ్యాటరీలో మంటలు వచ్చాయి. మహారాష్ట్ర లింగికి చెందిన సింగడి గౌరుబాయి అనే మహిళకు స్వల్ప గాయాలపాలైంది. వెంటనే ఆదిలాబాద్ ఆర్టీసీ డీఎంకు సమాచారమిచ్చారు. ఆ మహిళకు వైద్యం కోసం రూ 2వేలు చికిత్స కోసం కేటాయిస్తున్నామని డీఎం తెలిపారు.