కాగజ్నగర్ టౌన్: రాబందుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండే రాబందులు ప్రస్తుతం పదు ల సంఖ్యలో కూడా కనిపించక...
కాగజ్నగర్ టౌన్: రాబందుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉండే రాబందులు ప్రస్తుతం పదు ల సంఖ్యలో కూడా కనిపించకపోవడంతో వాటి రక్షణకు ప్రభుత్వం రూ.5 లక్షల నిధులు కేటాయించింది. గతేడాది అటవీ అధికారులు బెజ్జూర్ మండలం మొర్లిగూడ శివారులోని రాక్ గుట్టల వద్ద రాబందుల ఆవాస ప్రాంతాలను కనుగొన్నారు. ప్రస్తుతం 15 నుంచి 20 రాబందులు నివాసం ఉన్నట్లు చెబుతున్నారు. వాటి సం ఖ్యను పెంచేందుకు అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
మానవ తప్పిదాలే కారణం ..
రాబందులు అంతరించిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని పలువురు పేర్కొన్నారు.అనారోగ్యానికి గురైన పశువులకు డైక్లోఫెనాక్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఆ పశువులు మృతి చెందిన పక్షంలో రాబందులు వీటినే ఆహారం గా తీసుకుంటూ శ్వాస కోశ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నాయి. అంతే కాకుం డా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల కారణంగా రైతులు పశువులను అమ్మి వేస్తుండడం మూలంగా రాబందులకు ఆహారం లభించకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది.
సంతతి పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ..
బెజ్జూరు మండలం మొర్లిగూడ అటవీ ప్రాం తం లో రాక్గుట్టలో ఆవాసం ఉంటున్న రాబందుల పరిరక్షణకు, వాటి సంతతి పెంచడానికి గానూ అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంతో రూ.5 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొర్లిగూడ రాక్ గుట్టల వద్ద అటవీఅధికారులు 5గురు బేస్ క్యాంపు సిబ్బందిని నియమించి వాటి రక్షణకు చర్యలు చేపడుతున్నా రు. అంతే కాకుండా రాబందుల నివాస ప్రాం తం నుంచి 50 కిలోమీటర్ల దూర ప్రాంతాల్లో ఉ న్న గ్రామాల రైతులకు తమ పశువులకు డైక్లోఫెనా క్ ఇంజక్షన్లు వాడకుండా చర్యలు తీసుకుంటున్నా రు. ఈ విషయంపై ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయాధికారులకు తగు సూచనలు చేశారు. అంతే కాకుండా రాబందులు ఎక్కడ ఆహారం తీసుకుంటున్నాయి, ఎక్కడెక్కడికి వెళ్లి వస్తున్నాయన్న దానిపై ఏడాది పాటు పరిశీలించేందుకు ప్రత్యేక పరిశోధకుడిని ప్రభుత్వం నియమించింది.