హైదరాబాద్: స్వైన్‌ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యులు సూచించారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్యులు సచివా...
హైదరాబాద్: స్వైన్‌ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్యులు సూచించారు. రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్యులు సచివాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫ్లూ నివారణకు మంచి మందులున్నాయని తెలిపారు. ఫ్లూ అనేది చలికాలంలో సాధారణంగా వచ్చే వ్యాధియని..సకాలంలో మందులు వాడితే సరిపోతుందని ప్రజలకు సూచించారు. వాతావరణం మారగానే ఫ్లూ తగ్గిపోతుందని తెలిపారు. మనదేశంలో కొన్ని లక్షలమందికి ఫ్లూ సోకిందని..మందులు వాడాక తగ్గిందని వెల్లడించారు.