మారిన సిలబస్.. కొత్త పరీక్షా విధానం

మార్చి 25న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో 11 పేపర్లకు గాను నేటికి కేవలం 56 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అంట...

10th-students




మార్చి 25న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో 11 పేపర్లకు గాను నేటికి కేవలం 56 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అంటే ఒక్కో పేపర్‌కు సుమారు 5 రోజులు మాత్రమే. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివిధ సబ్జెక్టుల్లో ఇప్పటివరకు చదివి అవగాహన చేసుకున్న అంశాలనే మళ్లీమళ్లీ పునఃశ్చరణ చేయాలి. కొందరు విద్యార్థులకు పరీక్షలంటే భయం.. టెన్షన్... రాత్రింబవళ్లు తెగ చదివేయాలన్న ఆతృత.. కాని నిద్రపోకుండా అతిగా మేలుకోవడం, సరైన ప్రణాళిక, టైం మేనేజ్‌మెంట్, సరైన ఆహార నియమాలు పాటించకపోతే పరీక్షల కాలంలో ఇబ్బందులు తప్పవు. చదివి అవగాహన చేసుకున్న అంశాలను బాగా రాసి మంచి గ్రేడ్ తెచ్చుకోవాలంటే ... ఈ సూచనలు పాటించండి ... ఆత్మైస్థెర్యంతో ఉత్సాహంగా పరీక్షలు రాయండి... అనుకున్న విజయం మీ సొంతం అవుతుంది.

10th-students2




.పడాలి.8 ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొత్త సిలబస్, కొత్త పరీక్షా విధానంతో జరగనున్నాయి. పరీక్ష సమయం దగ్గర పడుతోంది. విద్యార్థులు సన్నద్ధతపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.



మారిన పరీక్ష విధానానికి అనుగుణంగా పరీక్షలకు సిద్ధం కావాలి. కొత్త సిలబస్‌లో విషయ అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. పాఠ్యవిషయాన్ని తగ్గించి కేవలం ముఖ్యాంశాలను విశదీకరిస్తూ వాటిపై జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం, నిత్యజీవిత అన్వయానికి సంబంధించిన ప్రశ్నలను ఇచ్చారు. అందువల్ల విద్యార్థులు గతంలోలాగ కేవలం గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడంలోనే కాకుండా చేయడం(పని అనుభవం), స్వీయ రచన, బృంద చర్చ ద్వారా నేర్చుకోవడం అనే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. 



బట్టీ విధానానికి స్వస్తి ...




- కేవలం చదివి బట్టీ పడితే సరిపోతుందనుకోవద్దు. ప్రశ్నలను నిజ జీవితానికి అన్వయిస్తూ అడుగుతారు. ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఉండవు. విద్యార్థి అవగాహనకు అనుగుణంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గతంలో కొన్ని ముఖ్యమైన పాఠాలు, ప్రశ్నలు చదివితే సరిపోయేది. కానీ ప్రస్తుత విధానంలో అన్ని పాఠాలను విధిగా చదివి అవగాహన చేసుకోవాలి. పాఠ్యపుస్తకంలోని ఏ అంశం కుడా బట్టీపట్టి రాయడానికి ఆస్కారం లేదు. పాఠ్య పుస్తకంలోని అంశాలను, భావనలను అవగాహన చేసుకుని నిజజీవితానికి అన్వయిస్తూ సమాధానాలు రాయాలి. ప్రశ్నలకు సమాధానాలు సూటిగా రాయడానికి బదులు బహుళ సమాధానాలు వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది. ఒకసారి పబ్లిక్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు తిరిగి పునరావృతం కావు.

10th-students3




పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలు ఉన్నవి ఉన్నట్లుగా రావు. అవే స్వభావంగల ఇతర ప్రశ్నలను రూపొందించి ఇస్తారు. మార్కెట్‌లో లభించే గైడ్లు , క్వశ్చన్ బ్యాంకులు ఆశించిన స్థాయిలో ఉపయోగపడవు. ప్రశ్నలు విదార్థుల్లో సృజనాత్మకత, విలువలు, సౌందర్యాత్మక స్పృహ, సహజవనరుల సంరక్షణ, జాతీయ సమైక్యత, మొదలైన అంశాలను అంచనా వేసే విధంగా రూపొందిస్తారు. విద్యార్థి సొంతంగా ఆలోచించి సమాధానాలు రాసేలా ప్రిపరేషన్ కొనసాగించాలి. 



మూల్యాంకన విశ్లేషణ




- హిందీ మినహా మిగతా భాష, భాషేతర సబ్జెక్టులకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోపేపర్‌లో 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 40 మార్కులకు పబ్లిక్ పరీక్ష, 10 మార్కులకు నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిలో పాఠశాలలో ఫార్మాటివ్ మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయులు మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. అయితే ప్రశ్న పత్రాన్ని చదవడానికి 15 నిమిషాల సమయం అదనంగా ఇస్తారు. 



ప్రశ్నల స్వరూపం- భారత్వం




నిర్మాణాత్మక (అంతర్గత ) మూల్యాంకనం 

timetable


- పాఠశాలలో నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలు నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనం నుంచి తీసుకునే 20 మార్కుల్లో కనీసం 7 మార్కులు సాధించాలి. ఒక నిర్మాణాత్మక మదింపునకు 50 మార్కులుంటాయి. ఇందులో వ్యక్తిగత ప్రతిస్పందనలకు 10 మార్కులు, పాఠ్యపుస్తక ప్రశ్నలకు (రాతపని) 10 మార్కులు, ప్రాజెక్ట్‌వర్క్‌కు 10 మార్కులు, స్లిప్ టెస్ట్‌కు 20 మార్కులు ఉంటాయి. నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకన మొత్తాన్ని 5కు కుదించి ఫలితం ఇస్తారు. 10 మార్కుల మొత్తాన్ని 8తో, 20 మార్కుల మొత్తాన్ని 16తో భాగించడం ద్వారా 5 కి కుదించి మొత్తం 20 మార్కుల ఫలితాన్ని అంతర్గత మదింపుగా బోర్డుకు అందజేస్తారు. ఇందులో కనీస మార్కుల నిబంధనలేదు. జీవ, భౌతిక శాస్ర్తాలకు కలిపి 20 మార్కులకు నిర్మాణాత్మక మూ ల్యాంకనం చేస్తారు. ఈ 20 మార్కుల్లో జీవ, భౌతిక శాస్ర్తాలకు 10 మార్కుల చొప్పున కేటాయించారు. 10 మార్కులకు గాను 3 1/2 మార్కులు పొందాలి. మొత్తం 7 మార్కులు సాధించాలి. మిగతా విషయాల్లో 20 మార్కులకు గాను 7 మార్కులు పొందాలి. 


- గతంలో ప్రశ్నపత్రాలను అధ్యాయాల వారీగా మార్కుల వెయిటేజీతో రూపొందించేవారు. ఫలితంగా ఏవో కొన్ని ముఖ్య అధ్యాయాలను చదివితే సరిపోయేది. కానీ ప్రస్తుతం ప్రశ్నపత్రాన్ని విద్యాప్రమాణాలకు అనుగుణంగా రూపకల్పన చేస్తున్నారు. దీనివల్ల ఏవో కొన్ని అధ్యాయాలను చదివితే సరిపోదు. అన్ని అధ్యాయాలను చదవాల్సిందే. ప్రశ్నలు ఏ అధ్యాయం నుంచైనా, ఎన్నైనా, ఏరకమైనవైనా అడగవచ్చు. కాబట్టి విద్యాప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నలను గుర్తించి పరీక్షలకు సన్నద్ధం కావాలి.



10th class




తెలుగు: పేపర్ - 1 
8 స్వీయ రచన - 30 మార్కులు 
అ) 5 లేక 6 వాక్యాల్లో సమాధానాలు రాసేవి 4 ప్రశ్నలు. (4X3= 12)
ఆ) అంతర్గత చాయిస్‌తో 3 వ్యాసరూప ప్రశ్నలు (3 X 6 = 18)
పదజాలం: 10 మార్కులు 
అ) బహుళైచ్ఛిక ప్రశ్నలు: 16. (16 X 1/2 = 8)
ఆ) ఒక వాక్య సమాధాన ప్రశ్నలు: 2 (2 X 1 = 2)



తెలుగు: పేపర్ - 2




1. అవగాహన, ప్రతిస్పందన (పఠనావగాహన)- 20 మార్కులు
2. సృజనాత్మక వ్యక్తీకరణ - 10 మార్కులు
3. వ్యాకరణాంశాలు - 10 మార్కులు 



హిందీ :




ఒక్క పేపర్ : 80 మార్కులు: సమయం 3 గంటలు.
1. అవగాహన, ప్రతిస్పందన (పఠన అవగాహన) 
20 మార్కులు: (5+5+5+5)



2. సృజనాత్మక వ్యక్తీకరణ: 40 మార్కులు (12+18+5+5)



3. వ్యాకరణాంశాలు: 10 మార్కులు 
ఇంగ్లీష్: పేపర్ -1 & 2
ఎ) రీడింగ్ కాంప్రహెన్షన్: 15 మార్కులు
బి) వకాబులరీ, గ్రామర్: 10 మార్కులు
సి) క్రియేటివ్ రైటింగ్ : 15 మార్కులు 



భాషేతర సబ్జెక్టులు




- వ్యాసరూప ప్రశ్నలు 4. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. మొత్తం 16 మార్కులు. అంతర్గత చాయిస్ ఉంటుంది.



- లఘు సమాధాన ప్రశ్నలు 6 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం 12 మార్కులు. అన్ని ప్రశ్నలకు సమా ధానం రాయాలి. 
- సంక్షిప్త సమాధాన ప్రశ్నలు 7 అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 7 మార్కులు. చాయిస్ ఉండదు



- బహుళైచ్ఛిక ప్రశ్నలు 10 ఉంటాయి. 1/2 మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు. చాయిస్ ఉండదు.



- ఒక్కో పేపర్‌కు మొత్తం 40 మార్కులకు గాను 14 మార్కు ల చొప్పున రెండు పేపర్లలో కలిపి 28 మార్కులు స్కోర్‌చేస్తే ఉత్తీర్ణత సాధించవచ్చు. 



ఆత్మవిశ్వాసమే ఆయుధం


saleem


ఆత్మ విశ్వాసమే లక్ష్యసాధనకు ప్రధాన ఆయుధం. విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితుల సూచనలు, ప్రణాళికాబద్ధ ప్రిపరేషన్ దోహదపడతాయి. ఆత్మవిశ్వాసంతో పరీక్షా హాల్లోకి వెళ్లగలిగితే సగం విజయం సాధించినట్లే. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఒత్తిడికి గురికాకుండా పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం తీసుకోగానే క్షుణ్ణంగా చదివి వెంటనే ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి. బాగా వచ్చిన ప్రశ్నలు, కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు, రాని ప్రశ్నలను గుర్తించి మొదట బాగా వచ్చిన ప్రశ్నలనే రాయాలి. తరువాత కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు ఆ తరువాత మిగతావాటి గురించి ఆలోచించాలి. సమయాన్ని గమనిస్తూ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా జాగ్రత్త నూతన అంశాలు వద్దు.


వివిధ సబ్జెక్టుల్లో ఇప్పటివరకు చదివిన అంశాలనే పునఃశ్చరణ చేయాలి. పరీక్షలకు ముందు నూతన అంశాలను చదవకపోవడమే మంచిది. వాటివల్ల తికమకపడే అవకాశం ఉంటుంది. పదోతరగతిలో ఎక్కువమంది విద్యార్థులు తెలుగులోనే తక్కువ మార్కులు తెచ్చుకోవడం, ఫెయిలవడం జరుగుతుంది. దీనికి కారణం కేవలం భయమే. నూతన ప్రదేశంలో పరిచయంలేని ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పరీక్ష రాయాల్సి రావడం తో బెరుకు వల్ల మొదటి పేపర్ సక్రమంగా రాయలేక ఇబ్బంది పడుతున్నారు. 
చేతి రాత కీలకం.. 



సరళమైన మంచి చేతిరాతతో ఎగ్జామినర్లను ఆకట్టుకోవచ్చు. రాసిన విషయం కనీసం చదివేందుకు వీలుగా ఉండాలి. జవాబులను సరైన హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ పెట్టి పాయింట్ల వారీగా రాయాలి. ప్రధానాంశాలను అండర్‌లైన్ చేయాలి. 



- ఈ సూచనలను పాటిస్తూ ఆత్మ విశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోవాలి. అనవసరంగా ఆందోళన చెందొద్దు. వచ్చిన జవాబులను ముందుగా రాయాలి. రాని జవాబు గురించి ఆలోచిస్తూ కూర్చో కూడదు. దీనివల్ల సమయం వృథా అవడంతోపాటు ఒత్తిడి పెరుగుతుంది. ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తే తప్పక విజయం మీకు దాసోహమవుతుంది. 



సమయపాలన అవసరం




బద్దకాన్ని, వాయిదా తత్వాన్ని వీడి చదువు పైనే పూర్తి దృష్టి సారించాలి. కాలం ఎంతో విలువైనది.. పరీక్షా సమయాల్లో ప్రతి క్షణం కీలకమైనది. బాగా చదువుకోవడానికి వేకువజాము సమయం అత్యంత అనుకూలమైంది. అందువల్ల తెల్లవారు జామున 4 గంటలకే లేచి కఠినమైన విషయాలను చదివితే సులభంగా అర్థమౌతాయి. చదువుకునే గది వాతావారణం ప్రశాంతంగా ఉండాలి. అభ్యసనానికి ఆటంకం కలిగించే అంశాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా టీవీ, మొబైల్, ఆడియో ప్లేయర్లను సమీపంలో ఉంచుకోవుద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. 



- ఒక టైమ్ టేబుల్ తయారుచేసుకొని దాన్ని కచ్చితంగా పాటించాలి.
- ఉదయం 4 నుంచి 6 గంటల వరకు కఠినమైన సబ్జెక్టు, 6 నుంచి 7 గంటల వరకు సులభమైన అంశాలను చదవాలి.



- ఉదయం 7 నుంచి 7.45 వరకు కాలకృత్యాలు, టిఫిన్



- ఉదయం 8.30 నుంచి 12.30 వరకు పాఠశాలలో స్టడీ అవర్స్



- మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు భోజనం, కొద్దిసేపు విశ్రాంతి.



- మధ్యాహ్నం 1.30 నుంచి 5.30 వరకు పాఠశాలలో స్టడీ అవర్స్



- సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు రిఫ్రెష్‌మెంట్, రాత్రి భోజనం.



- సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు కఠినమైన సబ్జెక్టు చదవడం



- రాత్రి 8.30 నుంచి 11 వరకు సులభమైన సబ్జెక్టు చదవడం



- రాత్రి 11కు నిద్రపోవడం.... 



- ప్రతి గంటకోసారి 10 నిమిషాలు రిలాక్స్ అవుతూ చదువు కొనసాగిస్తే రోజులో కనీసం 14 గంటలు ప్రణాళికా బద్ధంగా కృషి చేసినట్లవుతుంది. ఇలా చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. పగటి పూటే ఎక్కువగా చదువుకోవాలి. రాత్రి ఎక్కువగా మేలుకుంటే మెలటోనిన్ హర్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. 



తెలుగును తేలికగా తీసుకోకండి




- కొద్దిగా శ్రమిస్తే పదికి పది పాయింట్లు మీకే ..
తొలి పరీక్ష కావడంతో భయాందోళన, ప్రాథమిక అంశాలు, వ్యాకరణం, ప ద్య రచనల్లో విద్యార్థులకు అభిరుచి లేకపోవడం తెలుగులో తక్కువ మార్కులు రావడానికి కారణమవుతున్నాయి. మాతృభాషే కదా తేలికగా పాసవ్వచ్చు అనే అతి ఆత్మవిశ్వాసంతో చివరికి ఫెయిలై బాధ పడుతుంటారు. భాషపై మమకారం పెంచుకుని, చిన్న చిన్న మెళకువలు పాటిస్తూ, కొద్దిగా శ్రమిస్తే పది పా యింట్లు దక్కించుకోవచ్చు. 

విద్యా ప్రమాణాలు -కేటాయించిన మార్కులు




- పేపర్ - 1: స్వీయ రచన: 30 మార్కులు, పదజాలం: 10 మార్కులు 



- పేపర్ - 2: అవగాహన, ప్రతిస్పందన (పఠన అవగాహన): 20 మార్కులు
సృజనాత్మక వ్యక్తీకరణ : 10 మార్కులు
వ్యాకరణాంశాలు : 10 మార్కులు



- సంధుల్లో సవర్ణదీర్ఘ, గుణ, త్రిక సంధుల ఉదాహరణలు చదువుకోవాలి. 



- వ్యాస రచన ప్రశ్నల్లో ఎక్కువగా అడిగే అవకాశమున్న పండుగలు, సమకాలీన అంశాలు, ఎయిడ్స్ వ్యాధి, ప్రపంచీకరణ, ప్రకృతి విపత్తుల వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 



- ప్రకృతి వికృతులు, పద్య లక్షణాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి అర్థాలు, అలంకారాలు, నానార్థాలు, ఛందస్సు, పరోక్ష వాక్యాలు, సంయుక్త వాక్యా లు, విగ్రహవాక్యాలు, సమాసానికి ఉదాహరణలపై అవగాహన పెంచుకోవాలి. పుస్తకంలో ఉన్న ఉదాహరణలు, వ్యాకరణాంశాలు ప్రాక్టీస్ చేయాలి. 



- రెండో పేపర్‌లో పఠన అవగాహనలో తెలిసిన, తెలియని గద్య పద్య అంశాలను చదివి అవగాహన చేసుకుని సమాధానాలు రాస్తే తేలికగా 20 మా ర్కులు పొందవచ్చు.



- గైడ్ కన్నా పాఠ్యపుస్తకానికే ప్రాధాన్యమివ్వాలి. 



- అక్షర దోషాలు, ఒత్తు, పొల్లులు తప్పుల్లేకుండా జాగ్రత్త వహించాలి. 



- దస్తూరి అందంగా ఉంటే మరిన్ని మార్కులు పొందవచ్చు. 
పాయింట్ల రేటింగ్ పెంచే హిందీ



- హిందీ పరీక్ష ఒకే పేపర్ 80 మార్కులకు జరుగుతుంది. దీనికి సమయం 3 గంటలు. జాతీయ భాష హిందీలో అధికమార్కులు సాధించడంలో విద్యార్థులు విఫలమవుతున్నారు. హిందీలో 10కి 10 సాధించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. భాషపై భయాన్నివీడి అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుంటే 10 మార్కులు సులభంగా సాధించవచ్చు. 



విద్యా ప్రమాణాలు




- అవగాహన, ప్రతిస్పందన (పఠన అవగాహన): 20 మార్కులు 



- అభిప్రాయ వ్యక్తీకరణ సృజనాత్మకత: 40 మార్కులు 



- వ్యాకరణాంశాలు: 20 మార్కులు 



- చిన్న చిన్న పదాలతో హిందీని తేలికగా రాయవచ్చు. అవే భాషకు మూలం. రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఆ పదానికి అర్థమే మారిపోతుంది. 



- ఎక్కువ మార్కులు సాధించగలిగే వ్యాసరూప ప్రశ్నలు, స్వీయ రచనలపై పట్టు సాధించాలి. పుస్తకం చివర ఉన్న బిట్లను చదివితే 30 మార్కులు తేలికగా సాధించవచ్చు. 



- లేఖల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ మిత్రునికి లేఖ, ఛుట్టి పత్ ఎక్కువగా అడుగుతుంటారు. వీటిని బాగా చదువుకోవాలి. 



- ప్రశ్నపత్రంలో పార్ట్- ఏలో గద్య, పద్య భాగాలను అవగాహన చేసుకుంటే సులభంగా 20 మార్కులు సాధించవచ్చు.



- సంధి విచ్ఛేదనం, విశేషణం, ముహావరా (జాతీయాలు), లింగ్ బదల్‌నా, వచన్ బదల్‌నా వంటి శబ్ద, వాక్య సంబంధ వ్యాకరణాంశాలపై ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.



ఆంగ్లంలో అంశాలు తక్కువ.. మార్కులు ఎక్కువ




- అర్థాలు.. స్పెల్లింగ్‌పై పట్టు సాధించాలి. సరైన వ్యూహం పాటిస్తే 10కి10 సాధిం చవచ్చు. ఆంగ్లభాష పై ఉన్న అపోహలు, ఆందోళలను విస్మరించి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో చదువుకుంటే గ్రామీణ విద్యార్థ్ధులు సైతం పదికి 10 గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు. ఆంగ్లంలో ప్రతీ అంశంపై ప్రాథమిక అవగాహన ఉంటే అత్యధిక మార్కులు స్కోర్ చేయవచ్చు. 



విద్యా ప్రమాణాలు: పేపర్ -1, పేపర్- 2




- రీడింగ్ కాంప్రహెన్షన్: 15 మార్కులు



- వకాబులరీ, గ్రామర్: 10 మార్కులు



- క్రియేటివ్ రైటింగ్: 15 మార్కులు 



- ఇంగ్లీష్ రీడర్‌లోని పాఠాలు, పోయమ్స్‌కు సంబంధించిన ముఖ్యాంశాలను అవగాహన చేసుకుంటే పేపర్- 1లో ఏ ప్రశ్నకైనా సులభంగా సమాధానం రాయవచ్చు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం రాస్తే 15 మార్కులు సాధించవచ్చు.



- వాక్య దోషాలను సరిచేయడం, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌పై ఇచ్చిన వ్యాసంలో ఉన్న ఖాళీలను పూరించడం ప్రాక్టీస్ చేసుకోవాలి.



- ఇచ్చిన గద్యభాగాన్ని చదివి స్వయంగా సంభాషణ రూపంలోగాని, ప్రొఫైల్ రూపంలోగాని, సందేశ రూపంలోగాని రాయగలిగేటట్లు సిద్ధమవ్వాలి.



- బుక్‌లో ప్రతీ యూనిట్ వెనుక ఉన్న గ్రామర్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. అందు లోని పదాలకు అర్థాలు, సరైన సమాధానాలను గుర్తించగలగాలి.



- పేపర్-2లోని అన్‌సీన్ ప్యాసేజ్, పోయమ్స్‌ను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాస్తే తేలికగా 15 మార్కులు సాధించవచ్చు. 



- బిజినెస్, పర్సనల్ లెటర్స్ రాయడం నేర్చుకోవాలి. సందర్భోచిత లేఖలు, బయోగ్రాఫికల్ స్కెచ్, కాన్వర్జేషన్, బయోడేటా తయారీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.



- ఏదైనా విషయంపై వ్యాసం లేదా రిపోర్టు రాయగలిగేలా సిద్ధంకావాలి. దీనికోసం చిల్డ్రన్స్‌డే, టీచర్స్‌డే, రిపబ్లిక్‌డే వంటి కార్యక్రమాలపై అవగాహనతో రాయగలిగేలా ఉండాలి.



అవగాహనతోనే గణితంలో అందలం





- విద్యా ప్రమాణాలను అవగతం చేసుకుని పట్టుసాధిస్తే గణితంలో 10 గ్రేడ్ పాయింట్లు సాధించవచ్చు. 



- ఏ అధ్యాయం నుంచైనా ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు. ప్రతి అధ్యాయం కీలకమే. వాటిలో ప్రాథమిక భావనలు, సూత్రాలు, నిర్వచనాలు బాగా చదువుకోవడం వల్ల స్వల్ప, అతిస్వల్ప, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు తేలికగా జవాబులు రాయవచ్చు. 



- ప్రతీ భావన మీద సమస్యలను స్వయంగా రూపొందించుకొని సాధన చేయాలి. 



- పాఠ్యపుస్తకంలో ఉన్న సమస్యలు పరీక్షలో నేరుగా అడగరు. వాటిని మార్చి అవే స్వభావం గల ప్రశ్నలు ఇస్తారు. 
- వ్యాసరూప ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజి ఉంటుంది. కారణాలు వివరించడం, సమస్య సాధన వంటి ప్రశ్నలు ఎక్కువగా వ్యాసరూప ప్రశ్నల్లో ఇస్తుంటారు. 



- సమితులు, శ్రేఢులు, సిద్ధాంతాలు, నిరూపక జ్యామితి, సాంఖ్యకశాస్త్రం, సమ రూప త్రిభుజాలు, క్షేత్రమితి, త్రికోణమితి అనువర్తనాల నుంచి వ్యాసరూప ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 



- పాఠ్య పుస్తకంలోని ఆలోచించి, చర్చించి రాయండి, ఇవి చేయండి, ప్రయత్నించండి అని ఇచ్చిన సమస్యలను కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి.
- గణితం పేపర్-1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, శ్రేఢులు, నిరూపక జ్యామితి, పేపర్-2లో సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత తేలికైనవి. 



- మాదిరి సమస్యల కోసం ఎన్‌సీఈఆర్‌టీ, గోల్డెన్ సిరీస్ పుస్తకాలను చూడాలి. 



మ్యాథ్స్‌లో విద్యా ప్రమాణాలు:




- సమస్యా సాధన: 40 శాతం (32 మార్కులు)



- కారణాలు విశ్లేంచి నిరూపించడం: 20 శాతం (16 మార్కులు)



- వ్యక్త పరచడం: 10 శాతం (8 మార్కులు)



- అనుసంధానం: 15 శాతం (12 మార్కులు)



- దృశ్యీకరణ : ప్రాతినిధ్య పరచడం : 15 శాతం (12 మార్కులు)



సైన్స్‌లో పటాలు కీలకం




- జీవ, భౌతికశాస్త్ర సబ్జెక్టుల్లో మార్కుల సాధనకు పటాలు కీలకమైనవి. 



- విద్యార్థులు పటాలను ప్రత్యేక శ్రద్ధతో ప్రాక్టీస్ చేయాలి. పటాల నిర్మాణం, పనిచేసే విధానాల గురించి బాగా చదువుకోవాలి. 



- ఏ ప్రశ్నను ఎలా అడిగే అవకాశం ఉందో ఊహించుకుని చదవాలి. ఒకే ప్రశ్నను వివిధ రకాల ప్రశ్నలుగా మార్చుకొని సమాధానాలు రాయడం నేర్చుకోవాలి.



- పుస్తకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందులోని ముఖ్యమైన భావనలు, ఫార్ములాలను గుర్తుంచుకోవాలి.



- విద్యార్థి తన అవగాహనను బట్టి సమాధానాలు రాయవచ్చు. 



- భావనలను పటాల ద్వారా వివరించడం, అసంపూర్తిగా ఉన్న పటాన్ని పూర్తిచేయడం, సందర్భాన్ని బట్టి పటాలను గీయగలగడం సాధన చేయాలి.



- సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రాల్లో ఇచ్చిన ప్రశ్నల సరళి గమనించి సాధన చేస్తే మంచి గ్రేడ్ పొందవచ్చు.



- ఫిజిక్స్‌లో ఉష్ణం, కాంతి, విద్యుత్ అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి.



- కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం, రసాయనబంధం, రసాయన చర్యలు, సమీకరణాలు, కార్బన్ దాని సమ్మేళనాలు, నూతన అధ్యాయం లోహ సంగ్రహణంపై ఎక్కువగా దృష్టి సారించాలి. 
జీవ, భౌతికశాస్త్ర విద్యా ప్రమాణాలు- భారత్వం:



- విషయావగాహన: 40 శాతం (16 మార్కులు)



- ప్రశ్నించడం, పరికల్పన చేయడం: 10 శాతం (4 మార్కులు)



- ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు: 15 శాతం (6 మార్కులు) 



- సమాచార సేకరణ నైపుణ్యం, ప్రాజెక్టు పనులు: 15 శాతం (6 మార్కులు)



- బొమ్మలు గీయడం, నమూనాల తయారీ: 10 (4 మార్కులు)



- అభినందన, సౌందర్యాత్మక స్పృహ, విలువలు పాటించడం, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యాన్ని గుర్తించి కాపాడటం: 10 శాతం (4 మార్కులు)
సాంఘికశాస్త్రంలో విషయ అవగాహనకే ప్రాధాన్యత 



- విద్యాప్రమాణాలు-కేటాయించిన మార్కులు
విషయ అవగాహన: 16 మార్కులు 
వ్యాఖ్యానించడం: 4 మార్కులు
సమాచార నైపుణ్యం: 
6 మార్కులు
సమకాలీన అంశాలపై ప్రతిస్పందన: 4 మార్కులు పట నైపుణ్యాలు: 6 మార్కులు ప్రశంస, సున్నితత్వం: 4 మార్కులు



- విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న జ్ఞానాన్ని, అవగాహనా సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలను రూపొందిస్తారు. 



- పేపర్-1లో మొదటి భాగమైన వనరుల అభివృద్ధి, సమానత (భూగో ళం, అర్థశాస్త్రం), పేపర్-2లో రెండో భాగమైన సమకాలీన ప్రపంచం, భారతదేశం (చరిత్ర, పౌరశాస్త్రం) పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.



- పట నైపుణ్యాన్ని బాగా సాధన చేయాలి. ఇండియా, వరల్డ్ మ్యాప్‌ల్లో ప్రధాన ప్రాంతాలు, అంశాల ఉనికిని ప్రాక్టీస్ చేయాలి. 



- పేపర్- 1లో భారతదేశ పటం, పేపర్- 2లో ప్రపంచ పటం ఇస్తారు.



- సమకాలీన అంశాలపై ప్రతిస్పందనకు ప్రతిరోజూ దినపత్రికలను చదవాలి.



- పాఠ్యాంశాల చివరన ఉండే కీలక పదాలను, నిర్వచనాలను, పట్టికలను, గ్రాఫ్‌లను బాగా విశ్లేషణ చేసుకుంటూ చదువుకోవాలి.



- ప్రశ్నలకు సొంతంగా సమాధానలు రాయగలిగేలా ప్రయత్నించాలి.

COMMENTS

పేరు

Adilabad AUDIO RELEASES ENTERTAINMENT GOSSIPS Health HYDERABAD INTERNATIONAL Job Search Jobs KARIMNAGAR KHAMMAM MAHABOOBNAGAR MEDAK MOVIE REVEWS NALGONDA NATIONAL NIZAMABAD Rangareddy SINGARENI NEWS TECHNOLOGY TELANGANA NEWS VIDEO SONGS WARANGAL worldcup2015
false
ltr
item
Tdaily.In - Telangana News: మారిన సిలబస్.. కొత్త పరీక్షా విధానం
మారిన సిలబస్.. కొత్త పరీక్షా విధానం
http://namasthetelangaana.com/updates/2015/jan/27/10th-students.jpg
Tdaily.In - Telangana News
https://telugunewvideos.blogspot.com/2015/01/blog-post_711.html
https://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/
http://telugunewvideos.blogspot.com/2015/01/blog-post_711.html
true
2091677902228022841
UTF-8
Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy