-మొదలైన గిరిజన జాతర -మారుమోగుతున్న చెట్టూపుట్టా -అర్ధరాత్రి మహాపూజలతో వేడుకలు షురూ (ఉట్నూర్), (ఇంద్రవెల్లి);కెస్లాపూర్‌లో సోమవారం అర్ధరాత...
-మొదలైన గిరిజన జాతర
-మారుమోగుతున్న చెట్టూపుట్టా
-అర్ధరాత్రి మహాపూజలతో వేడుకలు షురూ
(ఉట్నూర్), (ఇంద్రవెల్లి);కెస్లాపూర్‌లో సోమవారం అర్ధరాత్రి నాగోబా జాతర మొదలైంది. గురువారం నుంచి మర్రిచెట్ల వద్ద బస చేస్తున్న మెస్రం వంశీయులు, సోమవారం ఉదయం నుంచి మహాపూజలకు సిద్ధమయ్యారు. తమ ఆనవాయితీ ప్రకారం సంప్రదాయ పూజలు చేసి, డోలు, సన్నాయి, కాలికోం వాయిస్తూ కాలినడకన గంగాజలాలతో నాగోబా ఆలయానికి చేరుకున్నారు. తర్వాత ఆ జలాలను ఆలయ ఆవరణలో భద్రపరిచి, పెర్సపేన్, బాన్ దేవతలు, సత్యదేవతలకు పూజలు చేశారు. సిరికొండ నుంచి తెచ్చిన కుండలను మెస్రం కటోడ (పూజారు)లు 37 మంది మెస్రం వంశ ఆడపడుచులకు పంపిణీ చేశారు. తర్వాత కటోడ ఒక కుండ ఎత్తుకొని ముందుగా, వారి వెనుక కుండలను తీసుకుని మహిళలు ఆలయం నుంచి మర్రిచెట్ల వద్దకు వరుసగా వెళ్లారు. అక్కడ బావికి పూజలు చేసి, కుండల్లో నీరు నింపుకుని ఆలయానికి చేరుకున్నారు. తెచ్చిన నీటితో పుట్టలు తయారు చేశారు. ఏడు వరుసలతో ఏడు రకాల మట్టిగోళాలు చేసి, వాటితో బౌలి దేవతను తీర్చిదిద్దారు.
-గోవాడకు మెస్రం వంశీయులు..
కుటుంబ సమేతంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన మెస్రం పరివారం గోవాడ చేరుకుంది. గోవాడలో 22 కీతలు (పటేల్, కటోడ, గెకి, నాయక్వాడీ, ఝడియా, సంకపాయల, జోప్యా, పర్థాన్జి, సపల్లా, డప్, ఏవతి, హవాల్దార్, కోర్కర్, సపేలియా, అర్కాయి, డకోలి, రంకం, భాండే, బొడ్డిగుడియ, దివ్వె, మడావి, గరోడి) మాత్రమే ఉన్నారు. తర్వాత పొయ్యిలను ఏర్పాటు చేసుకొని, నైవేద్యాలు తయారు చేసి, వాటి వద్ద దీపారాదన చేశారు.
-సంప్రదాయబద్ధంగా మహాపూజలు
సాయంత్రం తర్వాత మెస్రం వంశీయులు గోవాడ నుంచి డోలు, సన్నాయిలు వాయిస్తూ ఆలయానికి వచ్చారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత గోదావరి జలాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు. 11 గంటల ప్రాంతంలో నాగోబాను పవిత్ర గోదావరి జలాలతో అభిషేకించారు. తర్వాత నాగోబాపై తెల్లని వస్ర్తాన్ని కప్పి నైవేద్యాలను సమర్పించారు. సంప్రదాయ పద్ధతిలో మహా పూజలు చేసి జాతరను అధికారికంగా ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కాగడాల వెలుగులో పూజలు చేశారు. తర్వాత మెస్రం వంశంలోకి అడుగుపెట్టిన కొత్త కోడళ్లను, తమ ఇంటి దైవానికి పరిచయం (బేటింగ్) చేశారు. ఈకార్యక్రమాలన్నీ ముగియడంతో మిగతా గిరిజనులంతా దైవన్ని దర్శించుకున్నారు.
-తరలివస్తున్న అడవిబిడ్డలు
తమ ఆరాధ్యదైవాన్ని దర్శించుకునేందుకు ఆదివారం నుంచే భక్తులు వస్తున్నారు. జిల్లా నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి మెస్రం వంశీయులు, గిరిజనులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. వారంపాటు ఇక్కడే ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరి రాకతో చెట్టూ పుట్టా కిక్కిరిసిపోతోంది. కెస్లాపూర్‌లో కోలాహాలం నెలకొంది. దుకాణాలు, రంగురాట్నాలు వెలియడంతో సందడి నెలకొంది.
-అధికారిక ఏర్పాట్లు..
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నాగోబా జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు 22న ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తుండగా భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి వివిధ స్టాళ్లు పెట్టించారు. దర్బార్ హాల్‌ను ముస్తాబుచేశారు. జాతరలో చేపట్టిన అభివృద్ధి పనులు, సౌకర్యాలపై జిల్లాస్థాయి అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మెన్ మెస్రం తుకారాం, దేవదాయ శాఖ ఈఓ రవికుమార్, స్థానిక సర్పంచ్ మెస్రం నాగ్నాథ్ తెలిపారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణరెడ్డితో కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఐటీడీఏ ఇన్చార్జి పీఓలు హాజరవుతారని చెప్పారు.
-మోహరించిన బలగాలు..
22న దర్బార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపథ్యంలో ఎస్పీ తరుణ్‌జోషి పర్యవేక్షణలో భారీ బలగాలను సిద్ధం చేశారు. దర్బార్‌హాల్ పక్కన పోలీసుల కోసం ప్రత్యేక గుడారాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలు, బాంబ్ స్కాడ్, ఇంటెలిజెన్స్ విభాగాల పోలీసులు కెస్లాపూర్ పరిసర ప్రాంతాలతోపాటు పలుచోట్ల మోహరించారు. మల్లాపూర్, తేజాపూర్, దుర్వగూడా, వాయిపేట్, పోచంపెల్లి, వాల్గొండ హీరాపూర్, పొల్లుగూడా, కన్నాపూర్, ధర్మసాగర్ తదితర గ్రామాల ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్ చేస్తున్నారు. ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆలయాని వెళ్లే మార్గంలో రోడ్డుపై ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించారు. ఏర్పాట్లను ఎస్పీ తరుణ్ జోషీ, సబ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ ఎస్ఎస్ రాజు, ఇతర జిల్లా అధికారులు సోమవారం పరిశీలించారు. జాతర ముగిసేవరకు అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఎస్పీ ఆదేశించారు.
-ప్రముఖుల పూజలు
జాతర ప్రారంభం కావడంతో సోమవారం నాగోబాను పలువురు అధికారులు, ప్రజాపతినిధులు దర్శించుకున్నారు. ఉదయం ఎంపీ గొడాం నగేశ్ నాగోబాను దర్శించుకుని, ఆలయవరణలో మెస్రంవంశీయులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాత్రి మహాపూజల తర్వాత కలెక్టర్ ఎం జగన్మోహన్ దర్శించుకుని, పూజలు చేశారు.