-జిల్లా పశుసంవర్ధక శాఖలో మహారాష్ట్ర పశువైద్యాధికారుల తిష్ఠ -బోగస్ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు -రాష్ట్ర పునర్విభజనతో వెలుగులోకి ...
-జిల్లా పశుసంవర్ధక శాఖలో మహారాష్ట్ర పశువైద్యాధికారుల తిష్ఠ
-బోగస్ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు
-రాష్ట్ర పునర్విభజనతో వెలుగులోకి బాగోతం
-సర్కారుకు ఉన్నతాధికారుల నివేదిక
మహారాష్ట్రకు చెందిన కొందరు, జిల్లా పశుసంవర్ధక శాఖలో అక్రమంగా తిష్ఠవేశారు. స్థానికులుగా బోగస్ ధ్రువీకరణ పత్రాలు సంపాదించి, పశు వైద్యాధికారులుగా ఏళ్లకేళ్లు కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ వ్యవహారం బయటపడగా, ఉన్నతాధికారులు సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. పక్క రాష్ట్ర అధికారుల నిర్వాకం వల్ల ఉద్యోగోన్నతులు నిలిచిపోతున్నాయంటూ పలువురు స్థానిక పశు వైద్యులు లబోదిబోమంటున్నారు.
మహారాష్ట్రకు చెందిన కొందరు జిల్లాలో పశువైద్యాధికారులుగా కొనసాగుతున్నారు. రెవెన్యూ శాఖ నుంచి బోగస్ నివాస ధ్రువీకరణ పత్రాలు సంపాదించుకుని స్థానికులమని అప్పటి ప్రభుత్వాన్ని నమ్మించి స్థానికుల ఉద్యోగాలు కొల్లగొట్టారు. ఇది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నా రాష్ట్ర పునర్విభజన కారణంగా శాఖలో ఉద్యోగుల వివరాలు సేకరిస్తుండగా వెలుగులోకి వచ్చింది. అప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ట్రిబ్యునల్తోపాటు హైకోర్టును ఆశ్రయించి ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ఇలా చాలా మంది ఉ న్నట్లు తెలుస్తుండగా ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన 9 మంది పశువైద్యాధికారుల గురించి ని ర్ణయం తీసుకోవాలని ఇటీవలనే ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభు త్వ నిర్ణయానికిఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. మహారాష్ట్ర అధికారుల కారణంగా తమకు రావాల్సిన ఉద్యోగోన్నతు లు నిలిచిపోతున్నాయని స్వరాష్ర్టానికి చెందిన పలువురు పశు వైద్యాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-అసలేం జరిగింది?
2000 సంవత్సరం వరకు జిల్లా పశువైద్య శాఖలో వైద్యాధికారుల కొరత తీవ్రంగా ఉండేది. మారుమూల ప్రాంతమైన జిల్లాలో విధులు నిర్వహించేందుకు ఎవరూ ముందుకురాని సమయం. ఈ అవకాశాన్ని మహారాష్ట్రకు చెందిన కొందరు ఆసరాగా తీసుకున్నారు. బ్యాచ్‌లర్ ఆఫ్ వెటర్నరీ సై న్స్ అండ్ ఎనిమల్ హబ్జెండరీ పూర్తి చేసిన మహారాష్ట్ర వాసులు రాష్ట్రం పరిధిలోని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ చేయించుకుని, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అధిక మొత్తంలో ముడుపులు తీసుకుని మ హారాష్ట్రకు చెందిన వారిని పశువైద్యాధికారులుగా నియమించినట్లు తెలుస్తోంది. గెజిటెడ్ అధికారి హోదా కలిగిన పశువైద్యాధికారి పోస్టులన్నీ రాష్ట్ర స్థాయిలోనే నియామకాలు జరిగినందునా స్థానిక అధికారులను కనీసం విచారించని పరిస్థితి అప్ప ట్లో ఉండేది.
నిజానికి 6 పాయింట్ ఫార్ములా ప్ర కారం.. ఒక రాష్ర్టానికి చెందిన వారు మరో రాష్ట్రం లో ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉంటుం ది. అయితే 6 పాయింట్ ఫార్ములా తప్పక పాటించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఏ రాష్ట్రంలోనైతే ఉద్యోగాలు కోరుతున్నారో అభ్యర్థులు ఆ రాష్ట్రం లో ఆరేళ్లపాటు నిరంతరాయంగా చదివి ఉండాలి. ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష వచ్చి ఉండాలి. ఈ లెక్క న జిల్లాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇక్కడ ఉద్యోగాలు కోరుకునేవా రు తప్పని సరిగా తెలుగు పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. సీనియార్టీ జాబితాలో చేరారంటే భాషా నైపుణ్య పరీక్షతోపాటు శాఖ పరమైన పరీక్షలు, అకౌంటెస్టు ల్లో కూడా ఉత్తీర్ణులు కావాలి. పూర్తి చదువులు, చివరికి బ్యాచ్‌లర్ ఆఫ్ వెటర్నరీ కూడా మహారాష్ట్రలోనే చదివిన వీరంతా జిల్లాలో గెజిటెడ్ అధికారులుగా కొనసాగతున్నారనే ఆరోపణల్తున్నాయి.
-బోగస్ ధ్రువీకరణలపైనే
మహారాష్ట్రకు చెందిన పశు వైద్యాధికారులు స్థానికులమని రెవెన్యూ శాఖ నుంచి ధ్రువీకరణ ప త్రాలు ఎలా పొందారనేది? అర్థం కానీ ప్రశ్న. ఉ ద్యోగాల్లో చేరే ముందే స్థానికత ధ్రువీకరణ పత్రా న్ని అభ్యర్థులు సంబంధిత శాఖకు అందించాల్సి ఉంటుంది. అయితే అప్పట్లో కొందరు తహసీల్దార్లు కూడా అధిక మొత్తంలో డబ్బుకు కక్కుర్తిపడి ఈ వ్యవహారానికి సహకరించారనే ఆరోపణలున్నాయి. మహారాష్ట్రతో సత్ససంబంధాలున్న జిల్లా సరిహద్దు గ్రామాల నుంచే బోగస్ నివాస ధ్రువీకరణ పత్రాలు పొంది మహారాష్ట్ర వాసులు ఉద్యోగాల్లో చేరినట్లు తెలుస్తోంది. ఈ అధికారుల వివరాలనింటినీ సంబంధిత ఉద్యోగి సర్వీస్ రికార్డుల్లో ఉంటాయి. వీటిని పరిశీలిస్తే వీరికి నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన అధికారుల పేర్లు బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయని పలువు రు అభిప్రాయ పడుతున్నారు.
అంతే కాకుండా 6 పాయింట్ ఫార్ములా ప్రకారం విద్యార్థుల ధ్రువీకరణ ఎక్కడ జరిందనే విషయంలో కూడా తేలవ చ్చు. సరైన విచారణ జరిపితే ఇటు బోగస్ నివాస ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన రెవెన్యూ, అటు బోగ స్ విద్యా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు కూడా ఈ వ్యవహారంలో దోషులుగా తేలే అవకాశాలు లేకపోలేదు.
-బయటికి వచ్చిందిలా
జిల్లాలో 101 పశువైద్యాధికారి పోస్టులు ఉన్నా యి. ఇందులో 76 మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ 76 మంది పశువైద్యాధికారుల్లో తొమ్మిది మంది మహారాష్ట్రకు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. గత జూన్‌లో రాష్ట్ర పునర్విభజన జరిగినపుడు ఈ శాఖలోని ఉద్యోగుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు కోరింది. అప్పటికే మహారాష్ట్రకు చెందిన వారు జిల్లాలో అధిక సంఖ్యలో అదీ గెజిటెడ్ అధికారుల హోదాలో ఉద్యోగాలు చేస్తున్నారనే విష యం ప్రచారంలో ఉంది. ప్రభుత్వం వివరాలు కోరే వరకు ఆర్.రమాకాంత్ అనే పశువైద్యాధికారి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరొకరు లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వీళ్ల వివరాలన్నీంటిని జిల్లా అధికారులు గత సెప్టెంబర్ 11న ప్రభుత్వానికి నివేదించారు. దీంతో శాఖలో అంతర్గత చర్చ మొదలైంది.
తనను సీనియారిటీ జాబితాలో చేర్చడం లేదని గతం (2006)లోనే మహారాష్ట్రకు చెందిన జమీల్ అహ్మద్ అనే పశు వైద్యాధికారి ట్రిబ్యునల్‌కు వెళ్లాడు. 2009, ఆగస్టు 28 న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీని పై స్పందించిన హై కోర్టు ఇతన్ని నాన్‌లోకల్ కింద పరిగణించి సీనియారిటీ జాబితాలో చేర్చాలని 2012, నవంబర్ 8న తీర్పు ఇచ్చింది. అయితే మిగతా అధికారుల విషయాన్ని కూడా పరిశీలించాలని గత ఉమ్మడి ప్రభుత్వాన్ని పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు కోరారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన తర్వాత నిర్ణయం కోసం కొత్త ప్రభుత్వానికి కూడా నివేదించారు.
-విచారణ జనిపించాలని వేడుకోలు
ఇక్కడి అధికారుల అవినీతి, లంచాల కక్కుర్తి కారణంగానే మహారాష్ట్రకు చెందిన వారు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారనీ, మహారాష్ట్రలో ఇలాంటి పను లు సాధ్యం కావని పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. బోగస్ నివాస ధ్రువీకరణ, విద్యార్హత పత్రాలు ఇచ్చిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని స్థానిక ఉద్యోగులు కోరుతున్నారు. 2005 వరకు వివిధ నోటిఫికేషన్లలో మహారాష్ట్రకు చెందిన 9 మంది తమ శాఖలోకి అక్రమంగా ప్రవేశించారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వీరి కారణంగా తమకు పదోన్నతులు నిలిచిపోతున్నాయని, భాష అర్థం కాక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని వా పోతున్నారు. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ విద్యాభ్యా సం చేసిన నిరుద్యోగులు జిల్లాలోనే అధిక సంఖ్య లో ఉన్నారని వారికి అవకాశం కల్పించాలంటే ప్రభుత్వం ఈ విషయంలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పశు సంవర్ధక శాఖ ఉద్యో గ సంఘాల నాయకులు కోరుతున్నారు.
-పశువైద్యులు వీరే
మహారాష్ట్రకు చెందిన పశువైద్యాధికారులు వీళ్లేనని జిల్లా అధికారులు నివేదిక ఇచ్చారు. ఆర్ రమాకాంత్ నార్నూర్ వీడీ (వెటర్నరీ డిస్పెన్సరీ) ఈయ న 2010 నవబంర్ 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పెన్షన్ బెనిఫిట్స్ కోసం ఈయన భార్య ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుం ది. కానీ మంజూరు రాలేదు. ఇక ఎండీ జియావుద్దీన్ బోసీ వీడీ (నాన్ మండల్), ఏ వినోద్ పొన్నా రి వీడీ (నాన్ మండల్), గిరీష్ దేశ్‌ముఖ్ మందమర్రి వీడీ, ఎండీ ఫర్వేజ్ అహ్మద్ ఇచ్చోడ వీడీ, కే ప్రకాష్ కుంటాల వీడీ, మహాజన్ గోపాల్ తానూర్ వీడీ, ఓం ప్రకాశ్ మామడ వీడీ, జమీల్ అహ్మద్ ఖాన్ చించోలి వీడీలపై 2014 సెప్టెంబర్ 11న ప్రభుత్వానికి పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు నివేదిక పంపించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సరైన నిర్ణయం తీసుకుంటేనే స్థానికులకు న్యాయం జరుగుతుందని పశు సంవర్ధక శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.