నిర్మల్ : యువతకు ఉపాధి అ వకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యా యశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్...
నిర్మల్ : యువతకు ఉపాధి అ వకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యా యశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నా రు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం నియోజకవర్గస్థాయి యువజన క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. నిర్మల్, లక్ష్మణచాంద, సారంగాపూర్, దిలావర్పూర్, మామడ మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించిన మం త్రి అల్లోల మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రో త్సహించేందుకు ప్రభుత్వం క్రీడారంగానికి అత్యధిక నిధులను కేటాయించిందన్నారు. దేశాభివృద్ధి లో యువత కీలకమని, రాబోయే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
జిల్లాలో అన్ని పాఠశాలల్లో క్రీడామైదానాలను ఏర్పాటుచేస్తామని, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని హామీనిచ్చారు. నిర్మల్ పట్టణంలో క్రీడల నిర్వహణకు, ఎన్టీఆర్ మినీస్టేడియం అభివృద్ధి పనులను రూ.కోటి 60లక్షలతో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయా జట్లు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో తలపడా యి. విజేతలకు సాయంత్రం బహుమతులను ని ర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, నిర్మల్ ఎంపీపీ సుమతిరెడ్డి , ఆర్డీఓ సీహెచ్. శివలింగయ్య, డీఎస్పీ మనోహర్‌రెడ్డి, ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్, వాలీబాల్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అజీంబీన్యాహియా, పేటా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి,ఎంపీడీఓ గజ్జారం, తహసీల్దార్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.